అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad Student | విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న రామ్ చరణ్ (15) మంగళవారం (మార్చి 03) బడి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Nizamabad Student | ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన..
గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. రామ్ చరణ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన బాలుడిగా గుర్తించారు. బాలుడి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత కారణాలా.. లేక చదువుల ఒత్తిడా అనే కోణంలో విచారిస్తున్నారు.

కాగా, రామ్‌చరణ్ మరణంపై బాలుడి మేనమామ గంగాధర్ నాయక్ అనుమానాలు వ్యక్తం చేశారు. పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయుల వేధింపుల వల్లనే బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, న్యాయం చెయ్యాలని కోరారు.

