Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nokia Layoffs 2026 | నోకియాలో భారీగా ఉద్యోగాల కోత! 14 వేల మందిని తొలగించే అవకాశం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఎడ్యుకేషన్​ & జాబ్స్​ - Nokia Layoffs 2026 | నోకియాలో భారీగా ఉద్యోగాల కోత! 14 వేల మందిని తొలగించే అవకాశం

ఎడ్యుకేషన్​ & జాబ్స్​

Nokia Layoffs 2026 | నోకియాలో భారీగా ఉద్యోగాల కోత! 14 వేల మందిని తొలగించే అవకాశం

ఒకప్పుడు మొబైల్ ఫోన్ల మార్కెట్‌లో రారాజుగా వెలుగొందిన దిగ్గజ సంస్థ నోకియా.. ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయింది. భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించనుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 3:26 సా.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
Nokia Layoffs 2026

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nokia Layoffs 2026 | నోకియా.. కనెక్టింగ్ పిపుల్ ట్యాగ్ లైన్ తో ప్రజలకు చేరువయ్యింది. ఒకప్పుడు ఆ కంపెనీ ఫోన్ చేతిలో ఉంటే గ్రాండ్‌గా ఫీల్ అయ్యేవారు. అది ఫీచర్ ఫోనే అయినా హస్తభూషణంగా నిలిచింది.

Contents
  • Nokia Layoffs 2026 | ఆదాయంలో భారీ క్షీణత
    • Nokia Layoffs 2026 | భారత్ విభాగంపైనా ప్రభావం..
      • Nokia Layoffs 2026 | నాయకత్వ మార్పులు..

అయితే స్మార్ట్ ఫోన్‌లు (Smart Phones), అందులోనూ డ్యుయల్ సిమ్ ఫోన్ల రాకతో దాని ప్రాభవం తగ్గింది. ప్రజల నాడిని పసిగట్టడంలో వెనకబడి మార్కెట్‌పై పట్టును కోల్పోయింది. తర్వాత స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లోకి పలు మోడళ్లను రిలీజ్ చేసినా.. చైనా కంపెనీలనుంచి పోటీని తట్టుకోలేక కుదేలయ్యింది. ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.

Nokia Layoffs 2026 | ఆదాయంలో భారీ క్షీణత

భారత మార్కెట్‌ (Indian market) లో నోకియా పనితీరు గణనీయంగా పడిపోయింది. 2025 నాలుగో త్రైమాసికంలో నికర అమ్మకాలు 15 శాతం తగ్గి సుమారు రూ. 4,290 కోట్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో నికర అమ్మకాలు సుమారు రూ. 5 వేల కోట్లుగా నమోదయ్యాయి. మరోవైపు 2023లో జరిగిన మొబైల్ నెట్‌వర్క్‌లు (Mobile networks), క్లౌడ్ సేవల విలీనం వల్ల ఏర్పడిన డూప్లికేషన్(ఒకే పనికి ఇద్దరు) ఉద్యోగులు ఉన్న పరిస్థితి ఏర్పడింది. అమ్మకాల్లో ఈ క్షీణతతోపాటు డూప్లికేషన్ ఉద్యోగాల వల్ల కంపెనీపై భారం పెరిగిపోతోంది. దీంతో లాభదాయకతను పెంచుకోవడానికి ఉద్యోగుల తగ్గింపు ఒక్కటే మార్గమని కంపెనీ భావిస్తోంది.

Nokia Layoffs 2026 | భారత్ విభాగంపైనా ప్రభావం..

నోకియా కంపెనీ (Nokia Company) తన గ్లోబల్ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని విభాగంపైనా గణనీయంగా పడనుంది. ఎనిమిదేళ్లుగా నోకియా తన ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. 2018లో 1.03 లక్షల ఉద్యోగులు ఉండగా.. ప్రస్తుతం 74,100కి తగ్గారు. ప్రస్తుతం భారత్‌లో కంపెనీకి 17 వేల మంది ఉద్యోగులున్నారు. ఇందులో 20 శాతం వరకు ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

Nokia Layoffs 2026 | నాయకత్వ మార్పులు..

భారత్‌లోని నాయకత్వ బృందంలోనూ నోకియా కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఇండియాలో కంపెనీ చీఫ్‌గా ఉన్న తరుణ్ ఛబ్రా పదవి నుంచి తప్పుకున్నారు. సమర్ మిట్టల్ కంపెనీ ఇండియా కంట్రీ బిజినెస్ లీడర్‌గా, విభా మెహ్రా ఇండియా కంట్రీ మేనేజర్‌గా నియమితులయ్యారు. వీరిద్దరూ ఏప్రిల్ 1 న బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇది కూడా చదవండి..: Gurukul Entrance Results | గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

Olympiad Education Benefits | విద్యార్థుల బంగారు భవితకు బాట.. ఒలంపియాడ్‌ విద్య..
UPSC Civil Services Results | సివిల్ సర్వీసెస్​ ఫలితాల విడుదల
IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
ISRO YUVIKA 2026 | విద్యార్థులకు సూపర్​ ఛాన్స్​.. ఇస్రో ‘యువిక 2026’ రిజిస్ట్రేషన్లు షురూ..
BEL Engineer Jobs | బీఈఎల్‌లో ఉద్యోగావకాశాలు
TAGGED:business newsglobal restructuringjob cutslayoffs newsNokia IndiaNokia layoffstech layoffs 2026telecom industry
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Illegal Mining Action Illegal Mining Action | అక్రమ మైనింగ్​పై చర్యలు తీసుకోవాలి : హరీశ్​రావు
Next Article Anganwadi Breakfast Scheme Anganwadi Breakfast Scheme | అంగన్​వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?