అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nothing Phone 4A | నథింగ్ కంపెనీ మరో మోడల్‌ను రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. 4 ఏ సిరీస్‌లో మరో రెండు మోడళ్లను వచ్చేనెల 5న భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనుంది. ‘నథింగ్.టెక్ వెబ్‌సైట్ ద్వారా ఈ లాంచ్ ప్రోగ్రామ్‌ను లైవ్‌గా చూడవచ్చు.
Nothing Phone 4A | మరో రెండు మోడళ్లు విడుదలకు సిద్ధం
లండన్‌కు చెందిన పాపులర్ టెక్ కంపెనీ నథింగ్ మరో రెండు మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమైంది. 4ఏ, 4ఏ ప్రో మోడళ్లకు సంబంధించిన కొత్త టీజర్ విడుదల చేసింది. వైట్ కలర్‌లో ఉన్న ఫోన్ బ్యాక్ సైడ్ మరింత అందంగా కనిపిస్తోంది. నథింగ్ సిగ్నేచర్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్ ఈ మోడళ్లలోనూ కొనసాగిస్తోంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తున్న ఈ కొత్త ఫోన్లు.. మార్చి 5వ తేదీన లాంచ్ కానున్నాయి. అనంతరం ఫ్లిప్‌కార్ట్‌తోపాటు నథింగ్ బెంగళూరు ఫిజికల్ స్టోర్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు లాంచింగ్ ఈవెంట్‌లోనే వెల్లడి కానున్నాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం స్పెసిఫికేషన్స్ ఇలా ఉండే అవకాశాలున్నాయి.
Nothing Phone 4A | 6.7 అంగుళాల డిస్ప్లే
- 6.7 అంగుళాల 1.5కే ఫ్లాట్ ఎల్‌టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120 హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఐపీ 65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉండవచ్చు
స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ఎస్‌వోసీ తో రానుంది. ఇది 2.71 జీహెచ్‌జెడ్ గరిష్ట క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. - 50 ఎంపీ ప్రైమరీ, 50 ఎంపీ టెలిఫొటో, 8 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌తో రానుంది. ఫ్రంట్ కెమెరా వివరాలు రివీల్ కావాల్సి ఉంది.
- 5400 ఎంఏహెచ్ బ్యాటరీ, 50డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశముంది.
- వైట్, బ్లూ, పింక్ కలర్స్‌లో లభిస్తుంది. నథింగ్ ఫోన్ 4 ఏ ధర రూ. 35 వేల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.
- ఎడమ వైపు కొత్త గ్లిఫ్ బార్ ఉంది. ఇందులో ఏడు స్క్వేర్ లైట్స్ (ఒకటి రెడ్ కలర్) కనిపిస్తున్నాయి. ఇది 9 ఇండివిడ్యువల్ మినీ ఎల్ఈడీలతో తయారైంది. 6 స్క్వేర్ లైటింగ్ జోన్లు ఉన్నాయి. 40 శాతం ఎక్కువ బ్రైట్‌గా ఉంటుంది. ఈ గ్లిఫ్ బార్ నోటిఫికేషన్లు, కాల్స్, మ్యూజిక్ కోసం లైట్స్ ఇస్తుంది. ఇక పవర్ బటన్, వాల్యూమ్ రాకర్లు కుడి వైపు ఉన్నాయి. ఎడమ వైపు మరో బటన్ కూడా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి..: Indian Stock Market | భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు.. ఐటీ స్టాక్స్ కుదేలు..

