అక్షరటుడే, వెబ్డెస్క్: OBC Women Quota | చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసే సమయంలో ఓబీసీ కోటా అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ప్రకటన విడుదల చేశారు.
చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఆ రిజర్వేషన్లలో ఓబీసీ మహిళల కోసం సబ్ కోటా ఉండటం అంతే ముఖ్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లును ప్రస్తుత లోక్సభ సమావేశాల్లో ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కవిత స్పందించారు. చట్టసభల్లో సామాజిక సమానత్వం రావాలంటే ఓబీసీ మహిళల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాల్సిందేనని అన్నారు.
OBC Women Quota | మళ్లీ పోరాటం
ఓబీసీ మహిళలకు ఉప కోటా లేకుండా ముందుకు వెళ్లాలని కేంద్రం భావిస్తే మరోసారి జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని కవిత తెలిపారు. మహిళా రిజర్వేషన్ల (Women’s Reservations) బిల్లు కోసం పలు రాజకీయ పార్టీలను, మహిళ సంఘాలను ఏకం చేసి గతంలో ఢిల్లీలో ధర్నా చేశామన్నారు. అదే విధంగా మరోసారి పోరాటం చేస్తామని హెచ్చరించారు. దేశంలో అన్ని వర్గాలకు మేలు చేయటమే సామాజిక న్యాయమని అన్నారు. ఈ విషయంలో అన్ని పార్టీల నాయకులు, ఆయా పార్టీల్లో ఉన్న ఓబీసీ మహిళ నేతలు, మహిళా సంఘాలు ఏకం కావాలని కోరారు.
OBC Women Quota | జాగృతి ఒత్తిడితోనే..
చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ కోసం జాగృతి ఒత్తిడి చేయడంతో కేంద్రం బిల్లు పెట్టిందని కవిత అన్నారు. దేశంలోని 18 రాజకీయ పార్టీలను, మహిళా సంఘాలను, పలు ప్రజా సంఘాలను ఏకం చేసి ఢిల్లీ (Delhi)లో నిరాహార దీక్ష చేశామని గుర్తు చేశారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, మేధావులతో చర్చలు, పలు నిరసన కార్యక్రమాల ద్వారా ఈ అంశాన్ని జాతీయ అజెండాగా మార్చమన్నారు.
ఇది కూడా చదవండి..: MLA Disqualification Case | అనర్హత కేసు.. ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

