Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Odisha | దారుణం: ఒకేరోజు రెండుసార్లు అత్యాచారం, అనంతరం నాలుగో అంతస్తు నుంచి తోసి హత్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Odisha | దారుణం: ఒకేరోజు రెండుసార్లు అత్యాచారం, అనంతరం నాలుగో అంతస్తు నుంచి తోసి హత్య

జాతీయంక్రైం

Odisha | దారుణం: ఒకేరోజు రెండుసార్లు అత్యాచారం, అనంతరం నాలుగో అంతస్తు నుంచి తోసి హత్య

జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో 23 ఏళ్ల యువతిపై ఒకే రోజు ఇద్దరు వ్యక్తులు వేర్వేరు చోట్ల అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన ఘటన కలకలం రేపింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 28, 2026 10:40 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Odisha Double Rape Murder
Odisha Double Rape Murder

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Odisha | ఒడిశా రాష్ట్రంలోని జ‌గ‌త్ సింగ్ పూర్ జిల్లా (Jagatsinghpur District) ప‌ర‌దీప్‌ ప్రాంతంలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. 23 ఏళ్ల యువతిపై ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ప్రదేశాల్లో అత్యాచారానికి పాల్పడి, చివరకు ఆమెను భవనం పై నుంచి కిందకు తోసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.

Contents
  • Odisha | సాయం పేరిట మరో దారుణం
    • Odisha | నమ్మించి మోసం చేసిన ప్రియుడు

జిల్లా ఎస్పీ అంకిత్ కుమార్ వ‌ర్మ‌ (SP Ankit Kumar Verma) వెల్లడించిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 22న ఈ ఘటన జరిగింది. బాధితురాలు తన ప్రియుడితో కలిసి వెళ్లి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అతని సూచనల మేరకు ఒక ఆలయానికి చేరుకుంది. అయితే అక్కడి నుంచి ఆమెను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ప్రియుడు, ఆమెపై అత్యాచారం చేసి రహమా బస్టాండ్ వద్ద వదిలేసి పరారయ్యాడు.

Odisha | సాయం పేరిట మరో దారుణం

దిక్కుతోచని స్థితిలో బస్టాండ్ వద్ద ఉన్న యువతిని జార్ఖండ్‌కు చెందిన మరో వ్యక్తి గమనించాడు. సాయం చేస్తానని నమ్మబలికి ఆమెను పారాదీప్‌లోని తన గదికి తీసుకెళ్లాడు. అక్కడ భవనం పైకప్పుపైకి తీసుకెళ్లి ఆమెపై మరోసారి అత్యాచారం చేశాడు. దారుణం బయటపడుతుందనే భయంతో ఆమెను నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

మరుసటి రోజు ఉదయం ఆమె మృతదేహం బయటపడింది. యువతి కనిపించడం లేదని ఆమె సోదరుడు ఫిబ్రవరి 22న తిర్టోల్ పోలీస్ స్టేషన్‌ (Tirtol Police Station)లో ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 23న గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసిన పోలీసులు, అనంతరం ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారిపై కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులు బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద నమోదు చేశారు.

Odisha | నమ్మించి మోసం చేసిన ప్రియుడు

ఈ ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత న‌వీన్ ప‌ట్నాయ‌క్ (Naveen Patnaik) తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. “ఇంకా ఎంతమంది అమాయకులు బలి కావాలి? రాష్ట్రంలో చట్టం ఉందా లేదా?” అంటూ ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళల భద్రతపై ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నమ్మించి మోసం చేసిన ప్రియుడు, ఆపదలో ఆదుకోవాల్సిన అపరిచితుడు ఇద్దరూ రాక్షసుల్లా మారడంతో ఒక యువతి ప్రాణం బలైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Ramakrishnan Case | మైనర్ అక్కాచెల్లెళ్లపై దారుణం.. జ్యోతిష్కుడికి 200 ఏళ్ల జైలు శిక్ష

Karnataka Politics | కర్ణాటకలో మరోసారి పొలిటికల్‌ ట్విస్ట్​.. సీఎం మార్పు తప్పదా!
CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!
South Central Railway Offer | ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు.. సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ ఆఫర్
Cyber fraud Hyderabad | మాజీ డీజీపీ మనవరాలికి సైబర్​ నేరగాళ్ల టోకరా
Judiciary Corruption Chapter | 8వ తరగతిలో “న్యాయవ్యవస్థలో అవినీతి” పాఠ్యాంశం.. ఎన్​సీఈఆర్టీపై సుప్రీంకోర్టు మండిపాటు
TAGGED:India rape murder caseIndian crime reportJagatsinghpur district caseNaveen Patnaik reactionOdisha breaking newsOdisha crime newsParadip incidentwomen safety India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Tirumala Devotee Rush Tirumala Devotee Rush | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ కంపార్టుమెంట్లు ఫుల్​..
Next Article Sharada Peeth Demolition Row Sharada Peeth Demolition Row | శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర: హరీశ్​ రావు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?