అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Oil Palm Cultivation | నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో ఆయిల్ పామ్(oil palm farming) సాగు జరిగేలా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖల అధికారులతో, ఆయిల్ పామ్ నర్సరీని నిర్వహిస్తున్న ప్రీ-యునిక్ కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
Oil Palm Cultivation | ఏడువేల ఎకరాలు లక్ష్యం..
ఈ ఏడాది ఏడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరిగేలా అంకిత భావంతో(Telangana farmers) పని చేయాలని కలెక్టర్ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆయిల్ పామ్ సాగు పురోగతిపై(Nizamabad agriculture) క్లస్టర్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సాగును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని, ఎంతో లాభదాయకమైన ఈ పంట సాగును చేపట్టి రైతులు ఆర్ధిక అభ్యున్నతి సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ పంట వల్ల కలిగే ప్రయోజనాల గురించి రైతులకు సరైన విధంగా అవగాహన కల్పిస్తూ క్షేత్రస్థాయి అధ్యయన యాత్రల ద్వారా వారిలో నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు.
Oil Palm Cultivation | అన్ని రైతు వేదికల్లో..
అన్ని రైతు వేదికలలో విరివిగా సమావేశాలు నిర్వహిస్తూ, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న(horticulture department) రాయితీలను వివరించాలని కలెక్టర్ సూచించారు. మద్దతు ధర, సుదీర్ఘ కాలం పాటు ఏటేటా సమకూరే రాబడి, అంతర పంటల సాగుకు గల అవకాశాలు(farming income India) తదితర అంశాలను వివరించాలని, ఆదర్శ రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ముందుకు వచ్చేలా చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. జిల్లాలో త్వరలోనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుందని, దీని కోసం అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనివల్ల కంపెనీ వారు రైతుల వద్దకే వచ్చి పంట దిగుబడి సేకరించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు. ఇప్పుడు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కలెక్షన్ సెంటర్లను అందుబాటులో ఉంచామని తెలిపారు.
Oil Palm Cultivation |జిల్లాలో..
జిల్లాలో 2022-23 నుండి ఆయిల్ పామ్ సాగుకు శ్రీకారం చుట్టగా, ఇప్పటివరకు 2,375 మంది రైతులు 6,164 ఎకరాల విస్తీర్ణంలో(sustainable farming) ఈ పంటను సాగు చేస్తున్నారని కలెక్టర్ వివరించారు. మూడు ఏళ్లు దాటిన మీదట పంట దిగుబడులు కూడా చేతికి అందడం ప్రారంభమైందన్నారు. సుమారు 1,476 ఎకరాలలో ఆయిల్ పామ్ గెలలు కోతకు వచ్చాయని, తద్వారా రైతుల ఖాతాలలో రూ.2.50 కోట్లు కూడా జమ అయ్యాయని అన్నారు. అంకాపూర్‌లో మార గంగారెడ్డి, కోటగిరి మండలం ఎత్తొండలో ఎం.రమాదేవి, అర్గుల్‌లో మధుసూదన్ రెడ్డి, కొప్పెర్ల గంగారం తదితర ఆదర్శ రైతులు ఇప్పటికే ఆయిల్ పామ్ సాగు ద్వారా లాభాలు పొందుతున్నారని(crop cultivation India) వివరించారు. సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారులు జె.గోవిందు, వీరస్వామి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ రావు, ప్రీ యునిక్ కంపెనీ ఏరియా మేనేజర్ సాయి కిరణ్, ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులు, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Thaibazaar Auction Response | తైబజార్ వేలం.. ఆదరణ కరువు

