Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Oil Palm Industry | జిల్లాలో ఆయిల్​పామ్​ పరిశ్రమ ఏర్పాటుకు కృషి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Oil Palm Industry | జిల్లాలో ఆయిల్​పామ్​ పరిశ్రమ ఏర్పాటుకు కృషి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి

నిజామాబాద్

Oil Palm Industry | జిల్లాలో ఆయిల్​పామ్​ పరిశ్రమ ఏర్పాటుకు కృషి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి

జిల్లాలో ఆయిల్​పామ్​ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పరిశ్రమ ఏర్పాటు కోసం స్థలాల పరిశీలన చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 18, 2026 1:38 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
Oil Palm Industry

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Oil Palm Industry | జిల్లాలో ఆయిల్​పామ్​ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా (Armoor Sub-Collector Abhigyan Malviya) ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయిల్ పామ్ ఇండస్ట్రీ నెలకొల్పేందుకు అనువైన స్థలాల కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.

Contents
  • Oil Palm Industry | జిల్లాలో ఆయిల్​ పామ్​ ఇండస్ట్రీతో ఉపాధి..
    • Oil Palm Industry | వంట నూనె తయీరీతో పాటు..
      • Oil Palm Industry | పంట సాగుకు ప్రభుత్వ భరోసా..

Oil Palm Industry | జిల్లాలో ఆయిల్​ పామ్​ ఇండస్ట్రీతో ఉపాధి..

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పిసుదర్శన్ రెడ్డి (MLA P. Sudarshan Reddy) మాట్లాడుతూ.. జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో మాట్లాడడం జరిగిందన్నారు. పరిశ్రమను జిల్లాకు మంజూరు చేసేందుకు సీఎం సంసిద్ధత తెలిపారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా అనువైన స్థలాన్ని ఖరారు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటైతే పెద్ద సంఖ్యలో ఆదర్శ రైతులు ఈ పంట సాగును చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. దీనివల్ల రైతులకు గణనీయమైన లాభాలు సమకూరడమే కాకుండా, ఆయిల్ పామ్ ఇండస్ట్రీ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Oil Palm Industry | వంట నూనె తయీరీతో పాటు..

వంట నూనె తయారీతో పాటు ఇతర అనేక ఉత్పత్తుల్లో వినియోగించే ఆయిల్ పామ్ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా 75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం పది శాతం విస్తీర్ణంలోపే ఈ పంట సాగు చేస్తున్నారని అన్నారు. దీనివల్ల ఇతర దేశాల నుండి వంట నూనె నిల్వలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సి రావడం భారంగా పరిణమించిందని, స్థానికంగానే ఆయిల్ పామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తే, రైతులు అధిక లాభాలు ఆర్జించడంతో పాటు ప్రజలకు కూడా మేలు చేసిన వారవుతారని అన్నారు. ఆయిల్ పామ్ పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తోందని, ఇన్​పుట్ సబ్సిడీని రైతు ఖాతాలో జమ చేస్తోందని తెలిపారు.

Oil Palm Industry

Oil Palm Industry | పంట సాగుకు ప్రభుత్వ భరోసా..

ఆయిల్ పామ్ మొక్కలకు అయ్యే వ్యయంలో కూడా అధిక మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ సబ్సిడీ రూపంలో కంపెనీలకు చెల్లిస్తుందని అన్నారు. ఆయిల్ పామ్ బోర్డు ఉన్నందున పంట అమ్మకం, ధర విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం ఉండదని భరోసా కల్పించారు. మొక్కలు అందించిన కంపెనీలే, బోర్డు ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తాయని తెలిపారు. ఎకరం విస్తీర్ణంలో సుమారు పది టన్నుల వరకు దిగుబడి వస్తుందని, అంతర పంట వేసుకొని అదనపు లాభాలను సైతం పొందవచ్చని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి చెప్పారు.

ప్రస్తుతం మార్కెట్లో ఈ పంటకు ఉన్న డిమాండ్​ను బట్టి చూస్తే ఎకరానికి కనీసం రూ.2లక్షల పైగా ఆదాయం ఆర్జించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని అన్నారు. స్థల పరిశీలన జరిపిన వారిలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, రమణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Navodaya Results | నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల.. సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేసిన జీవన్​రెడ్డి.. రేవంత్​రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు
Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో జబర్దస్త్​ టీం సందడి.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు
Citizen Friendly Policing | సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్​కు ప్రాధాన్యతనివ్వాలి: ఎస్పీ రాజేష్ చంద్ర
Minor Child Labour | కళాశాలలో మైనర్​ పనిచేస్తుండడంపై కలెక్టర్​ ఆగ్రహం.. ప్రిన్సిపాల్​కు షోకాజ్ నోటీసులు
Bike Theft Gang | అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టురట్టు
TAGGED:Armoor Sub-Collector Abhigyan MalviyaCM Revanth ReddyCollector Ila TripathiMLA P. Sudarshan ReddyOil Palm Industry
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article AICC Observer Appointment AICC Observer Appointment | ఏఐసీసీ పరిశీలకుడిగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నియామకం
Next Article Delhi Fire Accident Delhi Fire Accident | ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?