అక్షరటుడే, వెబ్‌డెస్క్: Olympiad Education Benefits | నేటి ఆధునిక ప్రపంచంతో విద్యార్థులు పోటీ పడాలంటే ఒలంపియాడ్ విద్య తప్పనిసరి అయిపోయింది. దీంతో ఈ విద్యకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. గతంలో ఒలంపియాడ్ విద్య అభ్యసించాలనుకుంటే మెట్రోపాలిటన్ సిటీలకు వెళ్లాల్సి వచ్చేది. అయితే విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన కాకతీయ విద్యాసంస్థల యాజమాన్యం.. నిజామాబాద్ నగరంలోనే ఆరేళ్ల క్రితం కాకతీయ ఒలంపియాడ్ స్కూల్(కేవోఎస్)ను ప్రారంభించింది. ఈ స్కూల్‌లో విద్యనభ్యసించిన అనేక మంది విద్యార్థులు జాతీయ స్థాయి ఐఐటీ, మెడికల్ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు.
Olympiad Education Benefits | మెట్రోపాలిటన్ సిటీ విద్యార్థులతో పోటీపడి..
మెట్రోపాలిటన్ సిటీల్లో ఐఐటీ ఫౌండేషన్ చదువుతున్న విద్యార్థులతో పోటీపడడం ఎంతో కష్టంగా ఉండేది. అదీ ఇంటర్మీడియట్ స్థాయిలో జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఐఐటీ, మెడికల్‌లో నేషనల్ ర్యాంకులు సాధించడం అసాధ్యం. కానీ, ఒలంపియాడ్ విద్యా విధానం ద్వారా దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్ఆనరు. ఒలంపియాడ్ విద్యలో స్కూల్ స్థాయి నుంచే ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్‌తో కూడిన బోధన అందించడంతో ఇది సాధ్యమైందని కేవోఎస్ డైరెక్టర్ రామోజీ రావు ‘అక్షరటుడే’కు వివరించారు. తాను స్వతహాగా ఐఐటీయన్ కావడంతో.. నిజామాబాద్ జిల్లాలో మరెంతో మందిని ఐఐటీ విద్య వైపు మళ్లించే ఉద్దేశంతో ‘కేవోఎస్’ ద్వారా ఒలంపియాడ్ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారు. కేవోఎస్ స్కూల్ ఏర్పాటు చేసిన ఆరేళ్లలోనే చాలామంది విద్యార్థులు ఐఐటీ, మెడికల్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించారు.
Olympiad Education Benefits | ఒలంపియాడ్ విద్య అంటే..
ఒలంపియాడ్ విద్యలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఉదయం సమయంలో రెగ్యులర్ స్కూల్ సిలబస్‌పై శిక్షణ ఇస్తారు. నిత్యం ప్రతి సబ్జెక్టుపై ఇంటర్, ఎంసెట్ స్థాయి లెక్చరర్లతో బోధిస్తారు. ఈ విధమైన విద్యాభ్యాసం కోసం శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటేనే విద్యార్థులు అలసట చెందకుండా ఉంటారు. ఇందుకోసం పిల్లలకు ఆటలు ఆడిస్తారు. ఫిజికల్ ఆక్టివిటీస్ చేయిస్తుంటారు. దీంతో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఐఐటీ, మెడికల్ బోధనను సులువుగా అర్థం చేసుకుంటారు. ప్రతి సబ్జెక్టుపై పూర్తి పట్టు సాధిస్తారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఒలంపియాడ్ విద్య దోహదం చేస్తుండడంతో ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇది కూడా చదవండి..: ISRO YUVIKA 2026 | విద్యార్థులకు సూపర్ ఛాన్స్.. ఇస్రో ‘యువిక 2026’ రిజిస్ట్రేషన్లు షురూ..

