అక్షరటుడే, న్యూఢిల్లీ: Om Birla impeachment rejection | లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్‌పై ప్రతిపక్షం తీసుకువచ్చిన ఇంపీచ్‌మెంట్ నోటీసును తిరస్కరించారు.
ప్రతిపక్ష పార్టీలు ఇటీవల గ్యానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో ఇంపీచ్‌మెంట్ నోటీసు సమర్పించాయి. ఎన్నికల ప్రక్రియలో, ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) అంశంపై వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది.
Om Birla impeachment rejection | నియమ నిబంధనలకు అనుగుణంగా లేదని
అయితే, నోటీసు పరిశీలించిన స్పీకర్ ఓం బిర్లా, అది నియమ నిబంధనలకు అనుగుణంగా లేదని తేల్చి, తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ఈ అంశంపై పార్లమెంట్‌లో తదుపరి చర్చకు అవకాశం లేకుండా పోయింది.
ఈ నిర్ణయంపై ప్రతిపక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల వ్యవస్థ పారదర్శకతపై ప్రశ్నలు ఉన్నాయని, ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తోంది.
Om Birla impeachment rejection | సుప్రీంకోర్టు న్యాయమూర్తి తరహాలోనే
కాగా, గ్యానేష్ కుమార్‌పై ఇంపీచ్‌మెంట్‌కు అవసరమైన మద్దతు సంఖ్య, విధివిధానాలు వంటి అంశాలు సైతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒక సీఈసీని తొలగించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి తరహాలోనే కఠిన ప్రక్రియ ఉంది. దీంతో ఈ ప్రయత్నం రాజకీయ ఒత్తిడి సాధనంగా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Uniform Civil Code | ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
