Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: One Rupee Shoes Offer | రూపాయికే బూట్లని ప్రచారం.. ప్రజలు పోటెత్తడంతో లాఠీఛార్జీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - One Rupee Shoes Offer | రూపాయికే బూట్లని ప్రచారం.. ప్రజలు పోటెత్తడంతో లాఠీఛార్జీ

జాతీయం

One Rupee Shoes Offer | రూపాయికే బూట్లని ప్రచారం.. ప్రజలు పోటెత్తడంతో లాఠీఛార్జీ

కేరళలోని కోళీకోడ్‌లో ఓ చెప్పుల దుకాణం యజమాని రూపాయికే బూట్లు ఇస్తానని ప్రకటించాడు. పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 9, 2026 11:50 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
One Rupee Shoes Offer
One Rupee Shoes Offer

అక్షరటుడే, వెబ్​డెస్క్ : One Rupee Shoes Offer | కొంతమంది దుకాణాదారులు ప్రచారం కోసం చేసే ప్రకటనలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. తక్కువ ధరకు వస్తువులు ఇస్తామని ప్రచారం చేస్తుండటంతో వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు. తీరా జనం వచ్చాక.. ఆయా దుకాణాదారులు చేతులు ఎత్తేస్తున్నారు.

Contents
  • One Rupee Shoes Offer | మొదటి వంద మందికి..
    • One Rupee Shoes Offer | తెలంగాణలో సైతం

రూపాయికే బూట్లు పంపిణీ చేస్తామంటూ కేరళ (Kerala)లోని ఓ చెప్పుల దుకాణం ప్రకటన ఇచ్చింది. కోళీకోడ్‌లో గల సదరు దుకాణం ఆదివారం ప్రత్యేక ఆఫర్​ పేరిట సోషల్ మీడియాలో రూపాయికే బూట్లు అంటూ ప్రచారం చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున దుకాణానికి చేరుకున్నారు.

One Rupee Shoes Offer | మొదటి వంద మందికి..

One Rupee Shoes Offer
One Rupee Shoes Offer

దుకాణ యజమాని రూపాయి నోటు చూపిన మొదటి 100 మందికి ప్రీమియం బూట్లు ఇస్తామంటూ ప్రకటన చేశారు. దీంతో అర్ధరాత్రి 2 గంటల నుంచే వినియోగదారులు దుకాణానికి పోటెత్తారు.దీంతో తెల్లవారుజామున 2 గంటల నుంచే వినియోగదారులు దుకాణానికి పోటెత్తారు. భారీగా ప్రజలు రావడంతో ఆ మార్గంలో ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ప్రజలకు సర్దిచెప్పినా వినకపోవడంతో లాఠీచార్జీ (Lathicharge) చేశారు. ఈ ఘటనకు కారణమైన దుకాణ యాజమానిని అరెస్ట్ చేశారు.

One Rupee Shoes Offer | తెలంగాణలో సైతం

గతంలోరాష్ట్రంలో సైతం పలువురు ఇలాంటి ఆఫర్ల పేరిట ప్రజలను మోసం చేశారు. తమ దుకాణాలు ఫేమస్​ కావడానికి కొంతమంది ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్​ (Hyderabad) శివారులోని ఓ సెకండ్​ హ్యాండ్​ కార్ల దుకాణం ఓనర్​ రూ.25 వేలకే కారు ఇస్తామని గతంలో రీల్స్​చేశాడు. తీరా ప్రజలు వచ్చాక కార్లు లేవని చెప్పడంతో వారు గ్యారేజీలోని కార్లను ధ్వంసం చేశారు. గతంలో రూ.4 వేలకే ల్యాప్​టాప్​, రూ.100కే బ్రాండెడ్​ టీ షర్ట్​లు, రూ.వెయ్యికే బైక్​లు అంటూ పలువురు ప్రచారం చేశారు.

ప్రజలు సైతం ఇలాంటి ప్రచారాలను నమ్మి మోసపోతున్నారు. ఇందులో 99 శాతం ఫేక్​ ఉంటున్నాయి. అయినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ప్రకటనలను నమ్మి ఆయా దుకాణాలకు చేరుకుంటున్నారు. దీంతో గందరగోళం నెలకొంటుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: President protocol controversy | రాష్ట్రపతి ప్రొటోకాల్ వివాదం.. టీఎంసీపై ప్రధాని ఆగ్రహం

Chhattisgarh IED Blast | ఛత్తీస్‌గఢ్​లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లకు గాయాలు
LPG Price Hike | వంటింట్లో మంట.. డొమెస్టిక్​ LPG ధర రూ.60 పెంపు.. వాణిజ్య సిలిండర్ రూ.115 పెరుగుదల!
Jal Jeevan Mission Extension | కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. జల్ జీవన్ మిషన్‌ పొడిగింపు..
BJP Bengal Candidates | బెంగాల్​పై బీజేపీ ఫోకస్​.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Bengaluru Lamborghini Stunt | లంబోర్గిని కారుతో ప్రమాదకరంగా స్టంట్స్​
TAGGED:fake discount offersindia viral newskerala shop chaoskozhikode crowd incidentLathichargeone rupee shoes offerpolice lathi charge keralasocial media marketing stuntviral shop promotion
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article TTD Ghee Tanker Accident TTD Ghee Tanker Accident | టీటీడీకి వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా.. 21 వేల లీటర్ల నెయ్యి తోడేసిన స్థానికులు
Next Article Telangana Rajya Sabha election Telangana Rajya Sabha Election | తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?