అక్షరటుడే, కామారెడ్డి: online gaming addiction | ఆన్లైన్ గేమింగ్‌కు అలవాటు పడిన యువత నేరాల బాట పడుతున్నారు. గేమ్‌లలో డబ్బులు పోగొట్టుకున్న యువకులు అప్పులపాలై వక్రమార్గంలో డబ్బులు సంపాదించే మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్‌లకు అప్పులపాలై ఓ యువకుడు ఎల్లారెడ్డిలో గొలుసు చోరీలకు (chain snatching) పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం చేసిన గొలుసు చోరీ కేసులో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ మేరకు ఎల్లారెడ్డి (Yellareddy Police) డీఎస్పీ శ్రీనివాస్ రావు మీడియాకు వివరాలు వెల్లడించారు.
online gaming addiction | తాడ్వాయి మండలం ఎండ్రియాల్‌లో..
డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 2న తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామంలో ఉదయం ఇంటిముందు పనులు చేసుకుంటున్న బాణాల అనసూయ అనే మహిళ మెడలో నుంచి ముఖానికి మాస్క్ ధరించిన దుండగుడు మూడు తులాల పుస్తెల తాడును చోరీ చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ ఆదేశాలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల (CCTV investigation) ద్వారా విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో చోరీకి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన బాణాల తిరుపతి రెడ్డిగా గుర్తించారు.
online gaming addiction | బస్టాండ్ వద్ద తిరుగుతుండగా..
కృష్ణాజీవాడి గ్రామ బస్టాండ్ వద్ద ఆదివారం తిరుపతిరెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా జల్సాలకు(gaming addiction) అలవాటు పడిన తిరుపతి రెడ్డి ఆన్లైన్ గేమింగ్ ద్వారా అప్పుల పాలైనట్టుగా తేలింది. పక్కా పథకం ప్రకారం గొలుసు చోరీకి పాల్పడటానికి నిర్ణయించుకుని చోరీకి పాల్పడ్డాడు. అతడిని అరెస్ట్ చేసి 3 తులాల పుస్తెల తాడు, కత్తి, ముఖానికి ధరించిన స్కార్ఫ్, దుస్తులు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్సై నరేష్ పాల్గొన్నారు.
