అక్షరటుడే, కామారెడ్డి: Operation Kavach Inspections | రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ కవచ్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) గురువారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది తీరును పర్యవేక్షించారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పాప్లిన్ డివైస్ ద్వారా 285 మందిని తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఓ డీసీఎం వ్యాను ఆపి డ్రైవర్‌కు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు (Drunk Driving Tests) చేశారు. అతడికి 210 పర్సెంటేజ్ వచ్చింది. దీంతో కేసు నమోదు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. మద్యం సేవించి బాధ్యతారాహిత్యంగా వాహనం నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు (Road Accidents) జరుగుతున్నాయని పేర్కొన్నారు. అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Operation Kavach Inspections | నిత్యం తనిఖీలు
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం నిరంతరం డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్టు ఎస్పీ పేర్కొన్నారు. ఆపరేషన్ కవచ్ (Operation Kavach)లో భాగంగా మొత్తం 305 మందిని తనిఖీ చేయగా 14 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. అనంతరం సిరిసిల్ల రోడ్డులో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో కలిసి అర్ధరాత్రి టీ, స్నాక్స్ తీసుకున్నారు. ఈ తనిఖీలలో ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy), కామారెడ్డి పట్టణ సీఐ నరహరి, మాచారెడ్డి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, నస్రుల్లాబాద్, బాన్సువాడ ఎస్సైలు అనిల్, పుష్పరాజ్, మహేష్, రాఘవేంద్ర, రాములు సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Chain Snatching | రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. భర్తతో నడుచుకుంటూ వెళ్తుండగానే భార్య మెడలో నుంచి బంగారం చోరీ

