అక్షరటుడే, కామారెడ్డి: Operation Kavach | తల్లి తిట్టిందని అలిగిన 14 ఏళ్ల బాలుడు అర్ధరాత్రి సైకిల్‌పై (Bicycle Journey) నిజామాబాద్ (Nizamabad) నుంచి కామారెడ్డికి బయలుదేరాడు. ‘ఆపరేషన్ కవచ్’లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు బాలుడితో ప్రేమగా మాట్లాడి వివరాలు సేకరించి అతడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
Operation Kavach | నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్‌కు చెందిన..
పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడిని తల్లి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎవరికీ చెప్పకుండా మంగళవారం మధ్యాహ్నం తన సైకిల్‌పై నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు బయలుదేరాడు. దాదాపు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి అర్ధరాత్రి 11:00 గంటల సమయంలో టేక్రియాల్ జంక్షన్ వద్దకు చేరుకున్నాడు.
అదే సమయంలో అక్కడ ఆపరేషన్ కవచ్‌లో(Operation Kavach) భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న దేవునిపల్లి పోలీసులు చీకట్లో ఒంటరిగా సైకిల్‌పై వెళ్తున్న బాలుడిని గమనించారు. అనుమానం వచ్చి ఆపి, బాలుడిని ప్రేమతో పలకరించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు(Police Rescue) బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
Operation Kavach | ఆందోళనలో బాలుడి తల్లిదండ్రులు..
అప్పటికే కుమారుడి ఆచూకీ తెలియక ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు బుధవారం తెల్లవారుజామున 3:00 గంటలకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు(Kamareddy News) చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
తమ బిడ్డను కాపాడిన పోలీసులకు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) మాట్లాడుతూ.. ఆపరేషన్ కవాచ్ ముఖ్య ఉద్దేశం నేరాల నియంత్రణతో పాటు, ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడమేనని పునరుద్ఘాటించారు.
కామారెడ్డి జిల్లాలో ప్రజల భద్రత కోసం తాము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆపరేషన్ కవచ్ నేడు ఆపదలో ఉన్న ఒక బాలుడిని సురక్షితంగా రక్షించడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ ఆ బాలుడు ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు, తమ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి, మానవీయ కోణంలో స్పందించి ఆ బాలుడి భవిష్యత్తును కాపాడటం అభినందనీయమని కొనియాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి బాలుడిని కాపాడిన దేవునిపల్లి పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
ఇది కూడా చదవండి: Nallamala Forest Fire | మహానంది నల్లమలలో భారీ కార్చిచ్చు.. వన్యప్రాణుల మనుగడకు ముప్పు!
