అక్షరటుడే, వెబ్‌డెస్క్: Oracle layoffs news | ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజ సంస్థ Oracleలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సంస్థ దాదాపు తన 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అనధికారిక సమాచారం నెట్టింట వైరల్ అవుతోంది.
Oracle layoffs news | మెయిల్స్..
పలువురు ఉద్యోగులకు ఉదయం వేళ నుంచే లేఆఫ్‌కు సంబంధించిన ఈ మెయిల్స్ అందుతున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ మెయిల్స్‌లో ఉద్యోగాల రద్దు, యాక్సెస్ నిలిపివేత వంటి వివరాలు ఉన్నట్లు సమాచారం.
కంపెనీల పునర్వ్యవస్థీకరణ..
కాగా, ఈ అంశంపై Oracle నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఉద్యోగుల తొలగింపు పరిమాణం, ప్రభావిత విభాగాలు, కారణాలపై స్పష్టత రాలేదు. టెక్ రంగంలో ఇటీవల ఖర్చు తగ్గింపు చర్యలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మార్పులు, ఆర్థిక ఒత్తిళ్లు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. తమ వనరులను పలు కంపెనీలు పునర్వ్యవస్థీకరించుకుంటున్నాయి. ఈ పరిణామాల వల్లనే ఇలాంటి లేఆఫ్స్ పెరుగుతున్నాయని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Oracle layoffs news | Oracleలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు.. ఉదయం నుంచే లేఆఫ్ ఈ మెయిల్స్!
