Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Owaisi Brothers Home Department | రాష్ట్రంలో ఒవైసీ బ్రదర్స్ చేతిలో హోంశాఖ: బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Owaisi Brothers Home Department | రాష్ట్రంలో ఒవైసీ బ్రదర్స్ చేతిలో హోంశాఖ: బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిజామాబాద్

Owaisi Brothers Home Department | రాష్ట్రంలో ఒవైసీ బ్రదర్స్ చేతిలో హోంశాఖ: బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయని, హోంశాఖను ఒవైసీ బ్రదర్స్ చేతిలో పెట్టారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 28, 2026 4:34 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Owaisi Brothers Home Department |

అక్షరటుడే, కామారెడ్డి: Owaisi Brothers Home Department | రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయని, హోంశాఖను ఒవైసీ బ్రదర్స్ చేతిలో(Owaisi Brothers Home Department) పెట్టారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి ఎమ్మెల్యే నివాసంలో శనివారం బీజేఎల్పీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Contents
  • Owaisi Brothers Home Department | కాంగ్రెస్​ గుండాలతో..
    • Owaisi Brothers Home Department | బీజేఎల్పీ సమావేశంలో తీర్మానాలు..
      • Owaisi Brothers Home Department | ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తేకుండా..
      • Owaisi Brothers Home Department | బీజేఎల్పీ తీర్మానాలు
      • Owaisi Brothers Home Department | భారీ బందోబస్తు

Owaisi Brothers Home Department | కాంగ్రెస్​ గుండాలతో..

ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డిలో (Kamareddy) ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడి హేయనీయమన్నారు. ఎమ్మెల్యేకే ఈ పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై గెలిచిన ఎమ్మెల్యేకు సెక్యూరిటీ ఇవ్వకుండా కాంగ్రెస్ గుండాల హత్యాయత్నం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేపై హత్యాయత్నానికి పాల్పడిన కాంగ్రెస్ గుండాలపై కేసు నమోదు చేయకుండా బీజేపీ కార్యకర్తలపై దాడిచేసి అరెస్ట్ చేయడం కక్షసాధింపు చర్యలో భాగమేనన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గతి తప్పాయని, బాన్సువాడ, నాగర్ కర్నూల్, నిర్మల్ ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేడని, సీఎం దగ్గరే ఆ శాఖ ఉందని, వీటన్నింటికి సీఎం రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Owaisi Brothers Home Department | బీజేఎల్పీ సమావేశంలో తీర్మానాలు..

బీజేఎల్పీ సమావేశంలో ఈ మేరకు పలు తీర్మానాలు చేశామని శాసనసభాపక్ష నేత పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన బడ్జెట్ దేశాభివృద్ధికి పెద్దపీట వేసిందని, దీనికి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశామన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అయిందనడానికి సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలే నిదర్శనమన్నారు. గతంలో కంటే బీజేపీ ఓటు బ్యాంక్​ మెరుగుపడిందని, 2028లో బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా ముందుకు వెళ్తోందని చెప్పారు. ఎమ్మెల్యేపై దాడి తర్వాత పరామర్శకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎక్కడిక్కకడ ఇళ్లలోనే నిర్బంధించడం దారుణమన్నారు. గతంలో సాయంత్రం లోపు వదిలిపెట్టేవారని, ఇప్పుడు 48 గంటల పాటు నిర్బంధించడం శోచనీయమని పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికే ఎదురుదాడికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.

Owaisi Brothers Home Department | ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తేకుండా..

ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తేకుండా అమలు చేయలేక రాష్ట్రం దివాళా తీసిందని మహేశ్వర్​ రెడ్డి అన్నారు. హామీలు అమలు చేయలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. హోంశాఖ సీఎం చేతిలో ఉందా.. ఒవైసీ బ్రదర్స్ చేతిలో ఉందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. బాన్సువాడలో జరిగిన ఘటనలో అనవసరంగా బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారా అని నిలదీశారు. ఎంఐఎం ఒత్తిడికి లొంగిపోయి కుట్రలు చేస్తారా అని ప్రశ్నించారు. స్టీరింగ్ మా చేతిలో ఉందని చెప్తున్న ఒవైసీ బ్రదర్స్ మాటలకు సీఎం చేతలకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. వడగళ్ల వానకు పంటలు నష్టపోతే ఇప్పటికి నివేదిక తయారు చేయలేదని, రైతులను ఆదుకోవాలని అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఫసల్ బీమా పథకంలో ప్రభుత్వం చేరకుండా రైతులను మోసం చేస్తోందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు, విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. వచ్చే నెల 7న ఆదిలాబాద్ రైతుల నుంచి పంటల భీమాపై దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు.

Owaisi Brothers Home Department | బీజేఎల్పీ తీర్మానాలు

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి నివాసంలో బీజేఎల్పీ సమావేశం నిర్వహించారు. శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు తీర్మానాలు చేశారు. సమావేశం వివరాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ వివరించారు. శాతిభద్రతల విషయంలో అసెంబ్లీలో చర్చ, ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి, రాష్ట్రంలో రైతులకు పంటల బీమా అమలుపై ఒత్తిడి, దేశాభివృద్ధికి పెద్దపీట వేస్తూ కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, రామారావు పటేల్, పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, ఏవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Owaisi Brothers Home Department

Owaisi Brothers Home Department | భారీ బందోబస్తు

క్యాంప్ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు బాన్సువాడకు వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేస్తారని ప్రచారం సాగింది. అయితే సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాన్సువాడకు బయలుదేరారు.

ఇది కూడా చదవండి..: Gandhari Mandal | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల జైలు

PDSU National Committee | పీడీఎస్​యూ జాతీయ కమిటీ సభ్యుడిగా అనుముల రవీందర్
Ayyappa Idol Procession | భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మూలవిరాట్ ఊరేగింపు
Women Empowerment | మహిళలకు సమానావకాశాలు కల్పిస్తూ సమాజాభివృద్ధికి కృషి: మంత్రి సీతక్క
Health Awareness Nizamabad | ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Jukkal Drinking Water | వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
TAGGED:BJP legislature partyBRS Congress politicsCM Revanth ReddyEleti Maheshwar ReddyKamareddy NewsOwaisi brothers controversyRevanth Reddy governmentTelangana law and orderTelangana political news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Menaka Guruswamy Rajya Sabha Menaka Guruswamy Rajya Sabha | అందరి దృష్టి ఆ లాయర్‌పైనే.. ఎందుకంటే?
Next Article Kakinada Fireworks Explosion Kakinada Fireworks Explosion | బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 20 మంది మృతి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?