అక్షరటుడే, ఆర్మూర్/కోటగిరి: Paddy Procurement Centers | జిల్లాలో వరికోతలు జోరందుకున్నాయి. కొన్నిప్రాంతాల్లో చివరి దశకు చేరుకున్నాయి. అలాగే అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు సైతం వెంటనే కొనుగోలు కేంద్రాలు (Procurement Centers) ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు కొన్ని ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Paddy Procurement Centers | నందిపేట్ మండలం వెల్మల్‌లో..
నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామంలో (Velmal Village) శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐలాపూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ గుజ్జి దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దేవేందర్ మాట్లాడుతూ రైతులు తమ పంటను తప్పనిసరిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎఫ్‌సీఐ కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకోవాలని సూచించారు. బయట దళారులకు తక్కువ ధరలకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ధాన్యం తూకం, రవాణా సౌకర్యాలు కల్పించాలని స్పెషల్ ఆఫీసర్ బాబురావు, సొసైటీ సెక్రెటరీ నరహరికి సూచించారు. లారీలు సమయానికి అందుబాటులో ఉంచి ధాన్యం తరలింపులో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు త్వరితగతిన జరగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కేంద్రంలో తాగునీరు, షెడ్లు, తూకం యంత్రాలు వంటి మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మహేష్, మాజీ వైస్ ఛైర్మన్ చిన్నరెడ్డి, మాజీ డైరెక్టర్లు, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Paddy Procurement Centers | పోతంగల్ మండలం కొల్లూరులో..
అక్షరటుడే,కోటగిరి : పోతంగల్ మండలం (Pothangal Mandal) కొల్లూరు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రాన్ని , ఏఎంసీ ఛైర్మన్ గైక్వాడ్ హన్మంత్, సర్పంచ్ లోని జగన్ ఐకేపీ ఏపీఎం భాస్కర్, రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం అమ్ముకొని గిట్టుబాటు ధర పొందాలన్నారు. దళారులకు అమ్మితే తూకంలో మోసం, ధరల్లో వ్యత్యాసం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతారని సూచించారు. కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు నిమ్మల శారద, ఆర్ఐ సయ్యద్ హుస్సేన్, ఉప సర్పంచ్ రవి, ఏఈవో శంకర్, సీసీ నాగలక్ష్మి రైతులు, సంపత్ మారుతి, దిగంబర్, నాగేష్, హనుమంత్, రమేష్, ప్రశాంత్, హౌగిరావు, గంగారం, సత్యం తదితరులు పాల్గొన్నారు.
బాల్కొండ మండలంలోని కిసాన్‌నగర్‌లో..
బాల్కొండ మండలంలోని కిసాన్‌నగర్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వేల్పూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొత్తఇంటి ముత్యం రెడ్డి, వైస్ ఛైర్మన్ గడ్డం నర్సారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు న్యాయమైన ధరలు అందేలా ఈ కొనుగోలు కేంద్రం ఉపయోగపడుతుందని, రైతుల అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు.

ఇది కూడా చదవండి..: BJP Dinesh Kulachari | మాట ఇచ్చి నిలబెట్టుకోవడం బీజేపీ నైజం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి
