అక్షరటుడే, ఎల్లారెడ్డి: Paddy Procurement Farmers | రైతులకు ఇబ్బందులు లేకుండా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. మండలంలోని అన్నాసాగర్, ఆజామాబాద్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
Paddy Procurement Farmers | దళారులకు అమ్మి మోసపోవద్దు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు (Farmers) దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో వేసవి దృష్ట్యా రైతులకు తాగునీరు, నీడ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లో సకాలంలో వరికొనుగోళ్లు చేపట్టాలన్నారు. అనంతరం వెంటవెంటనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, తహశీల్దార్ ప్రేం, ఐకేపీ సీసీ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Financial Literacy | విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే పొదుపు చేయడం నేర్చుకోవాలి..
