అక్షరటుడే, కోటగిరి : Paddy Procurement Supplies | కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు, లారీల కొరత లేకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ (Banswada) నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అధికారులకు, సొసైటీ పాలకవర్గ సభ్యులకు సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలోని విశాల సహకార పరపతి సంఘంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్‌తో కలిసి శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
Paddy Procurement Supplies | వెనువెంటనే కాంటాలు వేయాలి..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు తెచ్చిన ఎండిన ధాన్యాన్ని వెనువెంటనే కాంటాలు చేయాలన్నారు. ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ రకం రూ.2,389 కామన్ గ్రేడ్ రకం రూ.2,369 ఉంటుందన్నారు. వర్షాలు పడే సూచనలు ఉన్నా కూడా రైతులు ధైర్యంగా భగవంతుడి మీద నమ్మకంతో ధాన్యాన్ని కోసి ఆరబెట్టారన్నారు. చుట్టుపక్కల వర్షాలు ఉన్నా మన దగ్గర పడలేదన్నారు. ముందు చూపుతో 45వేల బస్తాలు వచ్చాయన్నారు. ఎక్కడా కూడా గోనెసంచులు, లారీల కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు. రాత్రి అయినా సరే లారీలు తీసుకొని వచ్చి కాంటలు చేయించాలని సెక్రెటరీ, సహకార సంఘం సిబ్బందికి సూచించారు.
Paddy Procurement Supplies | ఇసుకకు ఇబ్బందిగా ఉంది..
ఈ సందర్భంగా గ్రామస్థులు యాప్‌లో ఇసుకను బుక్ చేసుకుంటే కావట్లేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఇసుక అవసరం ఉన్నవారు ప్రాక్టెడ్ ద్వారా ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లవచ్చన్నారు. ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses)లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందజేసే బాధ్యత అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ… రైతులు వరి పండించడంలో రాష్ట్రంలోనే బాన్సువాడ నియోజకవర్గం ముందుందన్నారు. రైతుల అకౌంట్లో బోనస్ డబ్బులు పడ్డాయని రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గైక్వాడ్ హన్మంత్, సర్పంచ్, కల్లూరి సంధ్య హన్మాండ్లు, ఎంపీడీవో చందర్, ఆర్ఐ సయ్యద్ హుస్సేన్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు షాజీ పటేల్, పీఏసీ ఇన్‌ఛార్జి ఛైర్మన్ రియాజుద్దీన్, ఏవో నిషిత, సర్పంచులు, శ్రీనివాస్ రావు, జగన్, రామ్ రెడ్డి, భాస్కర్, రైతులు, గంధపు పవన్, గంగాధర్, ఎజాజ్ ఖాన్, రమేష్ సెట్,దిలీప్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Job Mela in Yellareddy | ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
