అక్షరటుడే, వెబ్‌డెస్క్: Padma River Bus Accident | బంగ్లాదేశ్ (Bangladesh)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాజ్‌బారి జిల్లా (Rajbari District)లోని దౌలత్‌దియా ఫెర్రీ టెర్మినల్ సమీపంలో సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి పద్మా నదిలోకి పడిపోయింది.
ఈ ప్రమాదం బుధవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈద్ సెలవులు ముగించుకుని ఢాకాకు తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం చోటుచేసుకున్న ప్రదేశం ఢాకా నగరానికి సుమారు 128 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Padma River Bus Accident | 23 మృతదేహాలు వెలికితీత
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు , అగ్నిమాపక దళం, నౌకాదళం సహా పలు రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటివరకు 23 మృతదేహాలను వెలికితీసినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రస్సెల్ మొల్లా (Police Inspector Russell Molla) తెలిపారు. ఇంకా కొందరు ప్రయాణికులు గల్లంతై ఉండవచ్చని భావిస్తున్నారు.
రాత్రి చీకటి కారణంగా సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిపివేసి, గురువారం ఉదయం మళ్లీ ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.
Padma River Bus Accident | బంగ్లాదేశ్ ప్రధాని తారీఖ్ రెహమాన్ తీవ్ర దిగ్భ్రాంతి
ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ అబ్దుల్ అజీజుల్ అనే ప్రయాణికుడు తన అనుభవాన్ని వివరిస్తూ.. బస్సు నదిలో పడిన వెంటనే తాను ఈదుకుంటూ బయటకు వచ్చానని తెలిపాడు. అయితే తన భార్య, బిడ్డ ఇంకా కనిపించలేదని కన్నీటి పర్యంతమయ్యాడు.
ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని తారీఖ్ రెహమాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలను వేగవంతం చేయాలని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని కూడా సూచించారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపగా, రోడ్డు భద్రత, వాహన నియంత్రణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
View this post on Instagram
ఇది కూడా చదవండి..: Iran Currency Collapse | ఏడున్నర డాలర్లుంటే.. అక్కడ కోటీశ్వరులే!

