Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Pakistan Afghanistan Airstrikes War | అఫ్గానిస్థాన్​పై పాక్​ యుద్ధం.. పలు నగరాలపై వైమానిక దాడులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Pakistan Afghanistan Airstrikes War | అఫ్గానిస్థాన్​పై పాక్​ యుద్ధం.. పలు నగరాలపై వైమానిక దాడులు

అంతర్జాతీయం

Pakistan Afghanistan Airstrikes War | అఫ్గానిస్థాన్​పై పాక్​ యుద్ధం.. పలు నగరాలపై వైమానిక దాడులు

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 27, 2026 11:07 ఉద.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Pakistan Afghanistan Airstrikes War
Pakistan Afghanistan Airstrikes War

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan Afghanistan Airstrikes War | అఫ్గానిస్థాన్​పై పాక్ యుద్ధం ప్రకటించింది. పలు నగరాలపై వైమానిక దాడులు చేసింది. తాజా దాడుల తర్వాత బహిరంగ యుద్ధం జరుగుతోందని పాకిస్తాన్ రక్షణ మంత్రి తెలిపారు.

Contents
  • Pakistan Afghanistan Airstrikes War | పాక్​ ప్రధాని హెచ్చరిక
    • Pakistan Afghanistan Airstrikes War | ఆపరేషన్​ గజాబ్​ లిల్​ హక్​
      • Pakistan Afghanistan Airstrikes War | 55 మంది పాక్​ సైనికులు మృతి
      • Pakistan Afghanistan Airstrikes War | తీవ్ర ఉద్రిక్తతలు

రెండు దేశాల మధ్య కొంతకాలంగా సరిహద్దు ఘర్షణలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్​ యుద్ధానికి దిగింది. ‘మా సహనం నశించింది. ఇక బహిరంగ యుద్ధమే’ అని పాక్​ రక్షణ మంత్రి ఖవాజా (Pak Defense Minister Khawaja) ముహమ్మద్ ఆసిఫ్ ప్రకటించారు. గతంలో సైతం పాక్​ వైమానిక దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో తాలిబన్​ ప్రభుత్వం పాక్​పై దాడులు చేపట్టింది. ఈ క్రమంలో గురువారం రాత్రి పాక్​ యుద్ధం ప్రకటించింది. యుద్ధ విమానాలతో కాబూల్​, కాందహార్​, ఫక్తియా ప్రావిన్స్​లపై వైమానిక దాడులు చేపట్టింది. దీంతో అఫ్గాన్​ సైతం ఎదురుదాడికి దిగింది.

Pakistan Afghanistan Airstrikes War | పాక్​ ప్రధాని హెచ్చరిక

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అఫ్గానిస్థాన్​ను హెచ్చరించారు. తమ దళాలు ఏదైనా దురాక్రమణను అణిచివేయగలవని చెప్పారు. ఏదైనా దూకుడు ఆశయాలను అణిచివేయగల పూర్తి సామర్థ్యం దళాలకు ఉందని ఎక్స్​ వేదికగా పేర్కొన్నారు. దేశం మొత్తం సైన్యానికి అండగా ఉంటుందన్నారు. పాక్​ వైమానిక దాడులను తాలిబాన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.

Pakistan Afghanistan Airstrikes War | ఆపరేషన్​ గజాబ్​ లిల్​ హక్​

పాకిస్థాన్ ఆపరేషన్​ గజాబ్ లిల్ హక్ పేరిట వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో 133 మంది అఫ్గాన్​ సైనికులు మరణించారని పాక్​ తెలిపింది. తాలిబన్లు సరిహద్దుపై దాడి చేసిన తర్వాత పాక్​ కాబూల్‌పై బాంబు దాడి చేసింది. కాగా తమ దాడిలో తన ఎనిమిది మంది సైనికులు మరణించారని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ నివేదించింది. అఫ్గాన్​ దళాలు ​ సరిహద్దు దళాలపై దాడి చేసిన కొన్ని గంటల తర్వాత పాక్​ యుద్ధానికి దిగింది.

Pakistan Afghanistan Airstrikes War | 55 మంది పాక్​ సైనికులు మృతి

తమ దాడిలో 55 మంది పాక్​ సైనికులు చనిపోయినట్లు తాలిబన్లు పేర్కొన్నారు. పాకిస్థాన్​ (Pakistan) మాత్రం ఇద్దరు సైనికులు చనిపోయినట్లు తెలిపింది. పాక్​లోని పలు సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని, 19 పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్​ దళాలు తెలిపాయి. నంగర్హార్‌లోని శరణార్థి శిబిరంపై జరిగిన క్షిపణి దాడిలో ఎనిమిది మంది ఆఫ్ఘన్ యోధులు మరణించగా, 11 మంది గాయపడ్డారని పేర్కొన్నాయి.

Pakistan Afghanistan Airstrikes War | తీవ్ర ఉద్రిక్తతలు

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. పాక్​ యుద్ధం ప్రారంభించడంతో అఫ్గాన్​ సైతం దాడులకు పాల్పడే అవకాశం ఉంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇరాన్​ ముందుకు వచ్చింది. రెండు దేశాల మధ్య అవగాహన, సహకారాన్ని పెంపొందించడానికి అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి తెలిపారు.

ఇది కూడా చదవండి..: Travel Advisory | ఇరాన్‌లో ఉండొద్దు.. భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ

Pakistan Fuel Crisis | పాకిస్థాన్​లో ఇంధన సంక్షోభం.. భారీగా పెరిగిన ధరలు
Mojtaba Khamenei | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి హెచ్చరికలు
Indians Killed in Iran Attacks | ఇరాన్‌ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి
UAE India Missile Deal | భారత రక్షణ రంగంలో కీలక పరిణామం.. బ్రహ్మోస్​, ఆకాశ్​ కొనుగోలుకు యూఏఈ ఆసక్తి!
Khamenei Death Claims | ఖమేనీ హతం.. ట్రంప్​, నెతన్యాహు ప్రకటన.. ధ్రువీకరించిన ఇరాన్​ మీడియా!
TAGGED:Border ClashesIran MediationKabul AirstrikesKandaharKhawaja Muhammad AsifOperation Ghazab Lil HaqPakistan Afghanistan Airstrikes WarPakistan Afghanistan WarPaktia ProvinceShehbaz SharifTaliban Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Rinku Singh Father Rinku Singh Father | టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్‌ ఇంట్లో విషాదం.. తండ్రి ఖంచంద్ర సింగ్ కన్నుమూత
Next Article Panneerselvam Joins DMK Panneerselvam Joins DMK | డీఎంకేలో చేరిన పన్నీర్​ సెల్వం
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?