అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pakistan Afghanistan Border Clash : దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 400 మందికి పైగా ఆఫ్ఘన్ తాలిబాన్ సైనికులు మరణించారని, 46 ప్రదేశాలు దెబ్బతిన్నాయని పాక్ మంత్రి ప్రకటించారు. పాక్ – ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఆదివారం (మార్చి 1) ఇరు దేశ దళాల యుద్ధం కొనసాగింది. బాగ్రామ్‌లోని యూఎస్ పాత వైమానిక స్థావరంతో సహా అనేక చోట్ల దాడులు చోటుచేసుకున్నాయి.
Pakistan Afghanistan Border Clash : దాడులు కొనసాగుతాయి..
పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్ అంతటా 46 ప్రదేశాలు వైమానిక దాడులకు గురయ్యాయన్నారు. 415 మంది ఆఫ్ఘన్ సైనికులను పాకిస్తాన్ చంపిందని మంత్రి ప్రకటించారు. తమ సైనికులలో 12 మందిని చనిపోయినట్లు తెలిపారు. దాడి ముగింపు గురించి సోషల్ మీడియా నివేదికలను తోసిపుచ్చుతూ, ఆఫ్ఘన్ తాలిబాన్‌పై ఆపరేషన్ కొనసాగుతోందని మరొక మంత్రి ప్రకటించిన తర్వాత సమాచార మంత్రి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Iran Massive Attacks Warning | పెద్ద ఎత్తున దాడులు చేస్తాం.. ఇరాన్ వార్నింగ్

