Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Pakistan Fuel Crisis | ఉద్యోగుల జీతాల్లో కోత.. పాఠశాలలకు సెలవులు.. పాక్​ కీలక నిర్ణయాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Pakistan Fuel Crisis | ఉద్యోగుల జీతాల్లో కోత.. పాఠశాలలకు సెలవులు.. పాక్​ కీలక నిర్ణయాలు

అంతర్జాతీయం

Pakistan Fuel Crisis | ఉద్యోగుల జీతాల్లో కోత.. పాఠశాలలకు సెలవులు.. పాక్​ కీలక నిర్ణయాలు

ఇంధన సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్​ కఠిన చర్యలు చేపట్టింది. పాఠశాలలకు సెలవులు, ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోమ్​ ఇచ్చింది.

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 10:52 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Pakistan Fuel Crisis
Pakistan Fuel Crisis

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan Fuel Crisis | పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు పాకిస్థాన్​ (Pakistan)ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదలతో ఆ దేశం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది.

Contents
  • Pakistan Fuel Crisis | ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం
    • Pakistan Fuel Crisis | బడులకు సెలవులు
      • Pakistan Fuel Crisis | విదేశీ ప్రయాణాలపై నిషేధం

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో చమురు ధరలు పెరుగుతుండటంతో దేశంలో ఇంధనాన్ని ఆదా చేసే లక్ష్యంతో పాక్​ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif) సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. ఇప్పటికే పెట్రోల్​ ధరలకు లీటర్​కు రూ.55 మేర పెంచారు. ధరలు మరింత పెరగకుండా చర్యలు తీసుకున్నట్లు షరీఫ్​ వెల్లడించారు. రెండు నెలల పాటు ప్రభుత్వ వాహనాలకు ఇంధన కేటాయింపును 50 శాతం తగ్గించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ కాలంలో 60 శాతం ప్రభుత్వ వాహనాలు పనిచేయడం మానేస్తాయన్నారు.

Pakistan Fuel Crisis | ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం

ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని 50 శాతం ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని పాక్​ పీఎం ఆదేశించారు. వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేస్తారన్నారు. అంబులెన్స్​లు, ప్రభుత్వ రవాణా వాహనాలు యథావిధిగా నడుస్తున్నాయని చెప్పారు. మిగతా ప్రభుత్వ వాహనాలకు 50శాతం ఇంధనం కోత పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టారు. కొత్త పరికరాల కొనుగోలుపై ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Pakistan Fuel Crisis | బడులకు సెలవులు

ఇంధన సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్​లో పాఠశాల సెలవులను పొడిగించారు. ఆన్​లైన్​ క్లాసులు నిర్వహించాలని విద్యా సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. మంత్రులు, సలహాదారులకు రెండు నెలల పాటు జీతం నిలివేస్తామని, మిగతా ఎంపీల జీతాలు 25 శాతం తగ్గుతాయని షరీఫ్ ప్రకటించారు. నెలకు 3 లక్షల కంటే ఎక్కువ జీతం పొందుతున్న ఉద్యోగులు రెండు రోజుల జీతాన్ని వదులుకుంటారన్నారు.

Pakistan Fuel Crisis | విదేశీ ప్రయాణాలపై నిషేధం

పాక్​ మంత్రులు, సలహాదారులు, అధికారుల అధికారిక విదేశీ ప్రయాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. అత్యవసరం అయితేనే ఇతర దేశాలకు వెళ్లాలని పేర్కొంది. అన్ని రాష్ట్ర విందులు, ఇఫ్తార్‌లపై కూడా నిషేధం అమలు చేస్తున్నట్లు పాక్​ ప్రధాని పేర్కొన్నారు. ఇంధన ధరలు మరింత పెరగకుండా చూసుకోవడానికి తాను ప్రయత్నిస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: Trump Oil Price Comments | చమురు ధరలు తగ్గుతాయి : ట్రంప్​ కీలక వ్యాఖ్యలు

 Iran F-35 Incident | అమెరికా F-35 విమానాన్ని కూల్చివేసిన ఇరాన్‌
Iran Underground Weapons | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇరాన్ భూగర్భంలోని ఆయుధాల వీడియో విడుదల..
Taliban Drone Attacks | పాక్‌పై డ్రోన్లతో విరుచుకుపడ్డ తాలిబన్లు..
Iran Drone Attack | యూఎస్​ ఎంబసీపై ఇరాన్​ దాడి
Iran Israel War UPDATES | మోజ్తాబా ఎన్నిక.. ఇరాన్​ యుద్ధంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
TAGGED:energy crisis pakistanfuel shortage pakistanglobal oil pricesPakistanpakistan economy crisisPakistan Fuel CrisisPakistan petrol price hikePakistan PM Shehbaz Sharifshehbaz sharif news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Suryakumar Yadav Retirement Suryakumar Yadav Retirement | సూర్య‌కుమార్ రిటైర్ కాబోతున్నాడంటూ ప్ర‌చారాలు.. ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చిన టీ20 కెప్టెన్
Next Article Lavanya Tripathi Harassment Lavanya Tripathi Harassment | హీరోయిన్​ లావణ్య త్రిపాఠికి సోషల్​ మీడియాలో వేధింపులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?