అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pakistan Kabul Airstrike | అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ (Kabul)పై పాకిస్థాన్ సోమవారం రాత్రి వైమానిక దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. పాక్ దాడిని పిరికిపంద చర్యగా పేర్కొంది. రంజాన్ సమయంలో దాడులు దారుణమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. దీనిని అఫ్గాన్ సార్వభౌమత్వంపై దాడిగా పరిగణిస్తున్నమని చెప్పింది.
కాబూల్‌లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్ (Pakistan) జరిపిన దాడిలో వందలాది మంది చనిపోయారు. ఈ దాడిలో సుమారు 400 మంది మరణించగా మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం సుమారు 9 గంటల సమయంలో కాబూల్ నగరాన్ని భారీ పేలుళ్లు కుదిపేశాయని స్థానిక మీడియా తెలిపింది. పేలుళ్లతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Pakistan Kabul Airstrike | ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు
పాక్ దాడులపై భారత్ మంగళవారం స్పందించింది. ఇది ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్ర ముప్పును కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది పిరికిపంద, అమానుషమైన హింసా చర్య అని విదేశాంగ శాఖ పేర్కొంది. పాకిస్థాన్ ఈ మారణకాండను సైనిక చర్యగా చిత్రీకరించడానికి యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు శాంతి, కరుణతో గడిపే పవిత్ర రంజాన్ మాసంలో ఈ దాడి జరగడం దారుణమని పేర్కొంది.
Pakistan Kabul Airstrike | దాడులు ఆపాలి
అఫ్గానిస్థాన్‌లోని ఆస్పత్రిపై దాడులు చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఈ నేరపూరిత చర్యకు పాల్పడిన వారిని జవాబుదారీగా చేయాలని, అఫ్గాన్ ప్రజలపై పాక్ చేస్తున్న విచక్షణారహిత దాడులను లేకుండా ఆపాలని ప్రకటనలో పేర్కొంది.ఈ సంక్షోభ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చింది.
ఇది కూడా చదవండి..: Kabul Airstrike | కాబూల్‌లో వైమానిక దాడి.. 400 మంది దుర్మరణం అంటూ తాలిబన్ ఆరోపణ.. పాకిస్థాన్ ఖండన

