అక్షరటుడే, వెబ్డెస్క్: Pakistan petrol price hike | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో పాకిస్తాన్ (Pakistan) లో ఎకంగా లీటర్ పెట్రోల్ ధరను రూ. 55 పెంచారు. ఇరాన్, అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది.
Pakistan petrol price hike | ఆయిల్ ధరలకు రెక్కలు
హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్ మూసి వేయడంతో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌ను ఇది మరింత ఇబ్బందిపెడుతోంది. ఆ దేశం దిగుమతి చేసుకునే చమురులో ఎక్కువగా హార్ముజ్ జలసంధి నుంచే వస్తోంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల ఈ మార్గంలో సరఫరాకు ఆటంకం కలగడంతో పెట్రోల్ ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా పెట్రోల్ (Petrol), హైస్పీడ్ డీజిల్ ధరలను లీటరుకు రూ. 55 చొప్పున పెంచుతూ పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. తాజా పెంపుతో పాకిస్తాన్‌లో (Pakistan petrol price hike) పెట్రోల్ ధర లీటరుకు రూ. 266.17 నుంచి రూ. 321.17కు, హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ. 280.86 నుంచి రూ. 335.86కు చేరాయి. పెట్రో ఉత్పత్తుల ధరలు ఇంత భారీగా పెరగడం ఆ దేశ చరిత్రలో ఇదే ప్రథమమని భావిస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Iran Destroys THAAD Radar | యూఎస్ డిఫెన్స్ సిస్టంను ధ్వంసం చేసిన ఇరాన్

