Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Pakistan Semifinal Chances | ఇంగ్లండ్ విజ‌యంతో మారిన లెక్క‌లు.. పాకిస్తాన్ సెమీస్‌కి చేరాలంటే..!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - Pakistan Semifinal Chances | ఇంగ్లండ్ విజ‌యంతో మారిన లెక్క‌లు.. పాకిస్తాన్ సెమీస్‌కి చేరాలంటే..!

క్రీడలు

Pakistan Semifinal Chances | ఇంగ్లండ్ విజ‌యంతో మారిన లెక్క‌లు.. పాకిస్తాన్ సెమీస్‌కి చేరాలంటే..!

ఇంగ్లాండ్ విజయం పాకిస్థాన్‌కు సెమీఫైనల్ ద్వారాలు మళ్లీ తెరిచింది. అయితే శ్రీలంకపై భారీ విజయం సాధించగలిగితేనే పాక్‌కు అవకాశం ఉంటుంది

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 28, 2026 10:29 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Pakistan Semifinal Chances
Pakistan Semifinal Chances

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan Semifinal Chances | ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 (ICC T20 World Cup 2026)లో సెమీఫైనల్ రేసు ఆసక్తికర మలుపు తిరిగింది. ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సూపర్-8 దశలో జరిగిన తాజా మ్యాచ్ ఫలితం పాకిస్థాన్ ఆశలకి మళ్లీ ప్రాణం పోసింది.

Contents
  • Pakistan Semifinal Chances | పాయింట్ల పట్టికలో ఉత్కంఠ
    • Pakistan Semifinal Chances | పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే:

కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియం (Premadasa Stadium) వేదికగా జరిగిన కీలక పోరులో ఇంగ్లండ్ జ‌ట్టు న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో గ్రూప్-2 సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. హ్యారీ బ్రూక్ సారథ్యంలో ఇంగ్లాండ్ జట్టు సూపర్-8లో వరుసగా మూడు విజయాలతో 6 పాయింట్లు సాధించి గ్రూప్-2 టాపర్‌గా సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. వారి గెలుపుతో న్యూజిలాండ్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఇప్పటివరకు బలంగా కనిపించిన కివీస్ జట్టు ఇప్పుడు నెట్ రన్ రేట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Pakistan Semifinal Chances | పాయింట్ల పట్టికలో ఉత్కంఠ

ప్రస్తుతం న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌లు ఆడి 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. వారి నెట్ రన్ రేట్ +1.390గా ఉంది. మరోవైపు పాకిస్తాన్ జ‌ట్టు రెండు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క పాయింట్‌తో (-0.461 NRR) మూడో స్థానంలో ఉంది. అయితే పాక్‌కు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండటం వారికి పెద్ద ప్లస్. శనివారం పల్లెకెలెలోని ప‌ల్లెకెలె ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియం (Pallekele International Cricket Stadium) వేదికగా శ్రీలంక‌తో జరిగే మ్యాచ్ పాకిస్థాన్‌కు డూ ఆర్ డైగా మారింది.

Pakistan Semifinal Chances | పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే:

మొదట బ్యాటింగ్ చేస్తే: కనీసం 65 పరుగుల తేడాతో గెలవాలి.

చేజింగ్ చేస్తే: శ్రీలంక లక్ష్యాన్ని కేవలం 13 ఓవర్లలోనే ఛేదించాలి.

ఈ రెండు మార్గాల్లో ఏదో ఒకటి సాధించినప్పుడే పాక్ నెట్ రన్ రేట్ న్యూజిలాండ్ కంటే మెరుగ్గా మారుతుంది. ముఖ్యంగా శ్రీలంకను 100 పరుగుల లోపే కట్టడి చేస్తే సమీకరణం మరింత సులభమవుతుంది.

పల్లెకెలెలో వర్షం సూచనలు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశం మేఘావృతంగా ఉన్నా పూర్తి మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా పాకిస్థాన్‌కు కలిసొచ్చే అంశమే. ఇప్పటికే జింబాబ్వే, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ (New Zealand) చేతిలో వరుస ఓటములతో శ్రీలంక నిరాశలో ఉంది. ఈ బలహీనతను సద్వినియోగం చేసుకుని పాక్ భారీ విజయం నమోదు చేస్తే సెమీస్ బెర్త్ ఖాయం కావచ్చు. లేనిపక్షంలో న్యూజిలాండ్ నేరుగా సెమీఫైనల్‌కు చేరుతుంది. ఇప్పుడంతా పాకిస్థాన్ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంది. ఒక భారీ విజయం సాధిస్తే సెమీస్ కల నిజమవుతుంది… లేకపోతే టోర్నీ నుంచి నిష్క్రమణ తప్పదు.

ఇది కూడా చదవండి..: T20 World Cup | సెమీస్ ఆశలు పదిలం.. జింబాబ్వేపై భారత జట్టు విజయభేరి

Kuldeep Yadav Reception | అట్ట‌హాసంగా కుల్దీప్ యాదవ్ వెడ్డింగ్ రిసెప్షన్.. శాకాహార విందుతో అతిథులను మెప్పించిన టీమిండియా స్పిన్నర్
SRH New Captain | ఐపీఎల్ 2026లో SRHకి కొత్త కెప్టెన్.. అభిషేక్ శర్మ లేదా ఇషాన్ కిష‌న్‌ల‌లో ఒక‌రిని ఎంపిక చేసే ఛాన్స్..
T20 World Cup Final | టీ20 ప్రపంచకప్ ఫైనల్ నేడు.. భారత్-న్యూజిలాండ్ మ‌ధ్య టైటిల్ పోరు
India vs England Semi | ఉత్కంఠభరిత పోరులో భారత్​ విజయం.. చివరి వరకు పోరాడి ఓడిన ఇంగ్లండ్​.. 8న న్యూజిలాండ్​తో తుదిపోరు!
T20 World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ తో ఫైట్.. పాత ట్రెండ్‌ని బ‌ట్టి ప్రపంచకప్ విజేతగా భారత్.. ?
TAGGED:cricket semifinal raceEngland vs New ZealandICC T20 World Cup 2026net run rate scenarioNew ZealandPakistan cricket teamPakistan Semifinal ChancesPallekele International Cricket StadiumPallekele International StadiumPremadasa StadiumSri Lanka CricketT20 World Cup Super 8
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Bolivia Air Force Crash | రోడ్డుపై కుప్పకూలిన విమానం.. 15 మంది దుర్మరణం.. బొలీవియాలో ఘటన Bolivia Air Force Crash | రోడ్డుపై కుప్పకూలిన విమానం.. 15 మంది దుర్మరణం.. బొలీవియాలో ఘటన
Next Article Tirumala Devotee Rush Tirumala Devotee Rush | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ కంపార్టుమెంట్లు ఫుల్​..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?