అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pakistan Stock Market Crash | అమెరికా- ఇరాన్ యుద్ధం ప్రభావంతో చైనా మినహా గ్లోబల్ మార్కెట్లన్నీ (Global Markets) నష్టాల బాటలో పయనించాయి. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమయ్యింది.
కేఎస్ఈ 30 ఇండెక్స్ ఈరోజు ఇంట్రాడే డీల్స్‌లో దాదాపు 5 వేý పాయింట్లు (9.6 శాతం) నష్టపోయి 46,351.64 కనిష్ట స్థాయికి చేరుకుంది. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ (Pakistan Stock Market) చరిత్రలో దీనిని అత్యంత దారుణమైన పతనంగా భావిస్తున్నారు. ఇంట్రాడేలో దాదాపు 10 శాతం పడిపోవడంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపివేశారు.
Pakistan Stock Market Crash | పతనానికి కారణాలు..
అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధంతో పాకిస్తాన్ (Pakistan)లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. పాకిస్తాన్‌లో ఇరాన్ అనుకూల నిరసనలతో అక్కడ పరిస్థితి గందగోళంగా ఉంది. ఆదివారం దేశంలోని ప్రధాన ఓడరేవు నగరం కరాచీలోని యుఎస్ కాన్సులేట్ (US Consulate) గేట్లను నిరసనకారులు ముట్టడించడానికి ప్రయత్నించిన తర్వాత పోలీసులతో జరిగిన ఘర్షణల్లో కనీసం 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరోవైపు అప్ఘనిస్తాన్‌తో గత వారం రోజులుగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దాడులు ప్రతిదాడులతో ఇరువైపులా ప్రాణనష్టం సంభవిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై అమ్మకాల ఒత్తిడి పెరిగి, చరిత్రలో బలహీన సెషన్‌ను నమోదు చేసింది.
Pakistan Stock Market Crash | గ్లోబల్ మార్కెట్లలో చైనా మినహా..
ఓవైపు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమవగా.. ఇతర దేశాల మార్కెట్లు సైతం నష్టాల బాటలో పయనించాయి. ఆసియా షేర్లు 1.3 శాతం మేర పడిపోయాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 2.27 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 2.13 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.79 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.91 శాతం నష్టపోయాయి. భారత్‌కు చెందిన సెన్సెక్స్, నిఫ్టీలు 1.25 శాతానికిపైగా నష్టంతో ముగిశాయి. యూఎస్‌కు చెందిన డౌజోన్స్ ఫ్యూచర్స్ 1.06 శాతం, యూరోపియన్ యూనియన్‌కు చెందిన డీఏఎక్స్, సీఏసీలు 1.76 శాతం, ఎఫ్ టీఎస్ ఈ 1.03 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. చైనాకు చెందిన షాంఘై మాత్రం 0.47 శాతం లాభపడడం గమనార్హం.
ఇది కూడా చదవండి..: Stock Market Holidays | మార్చిలో భారీగా సెలవులు.. ఏకంగా 12 రోజులు మూసి ఉండనున్న స్టాక్ మార్కెట్లు

