Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: PAN and Banking Changes | పాన్ కార్డ్ నుంచి బ్యాంకింగ్ సేవల వరకు.. రేపటినుంచి అమలులోకి పలు మార్పులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - PAN and Banking Changes | పాన్ కార్డ్ నుంచి బ్యాంకింగ్ సేవల వరకు.. రేపటినుంచి అమలులోకి పలు మార్పులు

జాతీయం

PAN and Banking Changes | పాన్ కార్డ్ నుంచి బ్యాంకింగ్ సేవల వరకు.. రేపటినుంచి అమలులోకి పలు మార్పులు

మార్చి నెల ముగింపునకు వచ్చేసింది. రేపటినుంచి మరో కొత్త నెల ప్రారంభం కాబోతోంది. దీనికి ప్రత్యేకత ఉంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 31, 2026 2:27 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
9 గంటలు ago
Share
PAN and Banking Changes

అక్షరటుడే, వెబ్​డెస్క్: PAN and Banking Changes | మార్చి నెల ముగింపునకు వచ్చేసింది. రేపటినుంచి మరో కొత్త నెల ప్రారంభం కాబోతోంది. దీనికి ప్రత్యేకత ఉంది. ఏప్రిల్ 1వ తేదీ అంటే సాధారణ నెల ప్రారంభం మాత్రమే కాదు.. కొత్త ఆర్థిక సంవత్సరానికి తొలి రోజు. నూతన సంవత్సరంలో ఎన్నో ఆర్థిక పరమైన మార్పులు మొదలవనున్నాయి. రేపటినుంచి వచ్చే కీలక మార్పుల గురించి తెలుసుకుందామా..

Contents
  • PAN and Banking Changes | కొత్త ఆదాయపు పన్ను చట్టం..
    • PAN and Banking Changes | హైదరాబాద్ వాసులకూ అవకాశం..
      • PAN and Banking Changes | బేసిక్ పే 50 శాతం..
      • PAN and Banking Changes | వీటికి పాన్ తప్పనిసరి..
      • PAN and Banking Changes | పాన్ కార్డ్ జారీలో కొత్త నిబంధనలు..
      • రైల్వే టికెట్ క్యాన్సిల్ చేస్తే నో రీఫండ్!?
      • ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర పెంపు..
      • సేవా రుసుముల పెంపు..
        • టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి

PAN and Banking Changes | కొత్త ఆదాయపు పన్ను చట్టం..

ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025ని కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకొచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి వస్తోంది. సరళమైన భాషలో ఈ చట్టాన్ని రూపొందించారు. ట్యాక్సులు, ట్యాక్స్ శ్లాబుల యథాతథంగా కొనసాగనున్నాయి. గతంలో ఫైనాన్షియల్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ (Assessment Year) అని రెండు ఉండేవి. దీంతో ట్యాక్స్ పేయర్లు గందరగోళానికి గురయ్యేవారు. ఇకపై ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండే సమయాన్ని ట్యాక్స్ ఇయర్ గా వ్యవహరించనున్నారు.

PAN and Banking Changes | హైదరాబాద్ వాసులకూ అవకాశం..

హౌస్ రెంట్ అలవెన్స్ కింద బేసిక్ పేలో 50 శాతం పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకునే నగరాల జాబితాను పెంచారు. ఇందులో హైదరాబాద్‌కూ చోటు దక్కింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాలు మాత్రమే ఉండగా.. తాజాగా హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు నగరాలనూ చేర్చారు.

PAN and Banking Changes | బేసిక్ పే 50 శాతం..

కొత్త లేబర్ కోడ్స (Labour Codes) అమలులోకి రానున్నాయి. దీని ప్రకారం ఉద్యోగుల శాలరీ మొత్తంలో బేసిక్ పే 50 శాతంగా ఉండనుంది. దీంతో పీఎఫ్, గ్రాట్యుటీ వంటివి పెరుగుతాయి.

PAN and Banking Changes | వీటికి పాన్ తప్పనిసరి..

బ్యాంకు ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ నగదు ఒకేసారి లేదా విడతల వారీగా జమ చేసినా, విత్ డ్రా చేసినా పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక రోజులో రూ.50 వేలు దాటితే పాన్ అడుగుతున్నారు.
ఇళ్లు, స్థలాల కొనుగోలు, విక్రయం, గిఫ్ట్ లేదా జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ల విషయంలో ట్రాన్సాక్షన్ విలువ రూ.20 లక్షలు దాటితే ఇకపై పాన్ వివరాలు తప్పనిసరి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది.
టూవీలర్ లేదా ఏ వాహనమైనా కొనుగోలు చేసినప్పుడు దాని ధర రూ. 5 లక్షలు దాటితే కొనుగోలుదారు పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. పాత చట్టంలో టూవీలర్లకు ఈ రూల్ లేదు. ప్రస్తుతం బీమా పాలసీ కొనే సమయంలో వార్షిక ప్రీమియం రూ.50 వేలు దాటితేనే పాన్ వివరాలు తీసుకుంటున్నారు. ఇకపై ప్రతి పాలసీకి తీసుకోనున్నారు.

PAN and Banking Changes | పాన్ కార్డ్ జారీలో కొత్త నిబంధనలు..

ఇప్పటివరకు ఆధార్ కార్డు ఉంటే కేవలం కేవైసీతోనే ఇన్ స్టంట్ పాన్ కార్డు పొందడానికి అవకాశం ఉంది. ఈ విధానంలో మార్పులు చేశారు. ఇకపై ఆధార్ కార్డుతో పాటుగా ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ వంటి ధ్రువీకరణ పత్రాలు అవసరం. ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ ఎలా ఉందో.. పాన్ కార్డులో కూడా అక్షరం పొల్లు పోకుండా అలాగే ఉండాలి. తేడాలు ఉంటే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది.

రైల్వే టికెట్ క్యాన్సిల్ చేస్తే నో రీఫండ్!?

రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ కూడా మారాయి. ప్రస్తుతం రైలు ప్రయాణానికి 4 గంటలలోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ ఇవ్వడం లేదు. దీనిని ఎనిమిది గంటలకు పెంచారు. రైలు బయలుదేరే 24 గంటల ముందు నుంచి 8 గంటల మధ్యలో ఎప్పుడైనా టికెట్టును రద్దు చేస్తే 50 శాతం, 72 గంటల నుంచి 24 గంటల మధ్యలో టికెట్ రద్దు చేస్తే 25 శాతం కట్ చేస్తారు. రైలు బయలుదేరడానికి 72 గంటల సమయం ఉంటే క్యాన్సిలేషన్ రుసుములు మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని ఇస్తారు.

ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర పెంపు..

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరను పెంచింది. ప్రస్తుతం రూ. 3 వేలు ఉండగా.. దీనిని రూ. 3,075 కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

సేవా రుసుముల పెంపు..

హెచ్డీఎఫ్సీ, పీఎన్బీతోపాటు పలు బ్యాంకులు తమ కస్టమర్లకు షాక్ లు ఇవ్వడానికి రెడీ అయ్యాయి. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ పరిమితులు దాటితే వసూలు చేసే చార్జీలు, బ్యాంక్ లాకర్ ఫీజులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. ఏటీఎంనుంచి విత్ డ్రా పరిమితినీ తగ్గించాయి.

టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి

ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా డిజిటల్ పేమెంట్లలో భద్రతను పెంచింది. ఇప్పటివరకు ఆన్లైన్ పేమెంట్లకు ఓటీపీ మాత్రమే వచ్చేది. రేపటి నుంచి పేమెంట్ చేసేటప్పుడు ఓటీపీతోపాటు మరొక అదనపు భద్రతా ఫీచర్ (బయోమెట్రిక్ లేదా యాప్ అప్రూవల్ వంటివి) తప్పనిసరి.

ఇది కూడా చదవండి..: Assam BJP Manifesto | ప్రతి కుటుంబానికి ఇల్లు.. మహిళలకు నెలకు రూ.3వేలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల

Assam BJP Manifesto | ప్రతి కుటుంబానికి ఇల్లు.. మహిళలకు నెలకు రూ.3వేలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల
Delhi Liquor Scam | ఢిల్లీ లిక్కర్​ స్కాం కేసులో ట్విస్ట్​.. కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి నోటీసులు
Iran India Gas Support | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఇరాన్ భరోసా.. హర్మూజ్ జలసంధి దాటిన గ్యాస్ ట్యాంకర్
Sukhoi Su-30 Crash | కూలిపోయిన సుఖోయ్​ యుద్ధ విమానం.. ఇద్దరు పైలెట్ల మృతి
Delhi Fire Accident | ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి
TAGGED:Assessment YearBanking RulesCentral GovernmentFastag UpdatesFinancial Year 2025Labour CodesOnline PaymentsPAN and Banking ChangesPAN CardRailway CancellationTax Changes 2025
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article FIIs Stock Market Sale FIIs Stock Market Sale | స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. రూ. 1.22 లక్షల కోట్ల షేర్లు అమ్మేసిన ఎఫ్ఐఐలు
Next Article Godavari Pushkaralu Arrangements Godavari Pushkaralu Arrangements | గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Bengaluru Software Couple | సాఫ్ట్​వేర్​ దంపతుల ఆత్మహత్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?