అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: Panchareddy Suresh |నిజామాబాద్ నగరానికి చెందిన బీజేపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేష్ (42) మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు సమాచారం. కాగా.. పంచరెడ్డి సురేష్ భార్య అనిత 16వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందిన విషయం తెలిసిందే. సురేష్ మృతిపై పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలను నేడు నిర్వహించనున్నారు.
Panchareddy Suresh | కార్పొరేటర్‌గా సేవలు..
పంచరెడ్డి సురేష్ నిజామాబాద్ నగరంలోని 16వ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేశారు. ఆయన ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్లో కొనసాగారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సమయంలో బీజేపీ చేరారు. దీంతో ఆయన భార్య పంచరెడ్డి అనితకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆమె కార్పొరేటర్‌గా గెలుపొందిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి..: Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్

