అక్షరటుడే, హైదరాబాద్: Paraquat Ban Telangana | తెలంగాణ రాష్ట్రంలో పారాక్వాట్ డైక్లోరైడ్(గడ్డి మందు)ని నిషేధించాలని అసెంబ్లీలో తీర్మానించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
రైతులు వ్యవసాయానికి వాడుతున్న పారాక్వాట్ డైక్లోరైడ్ అత్యంత ప్రమాదకరమని మంత్రి తెలిపారు. అందుకే తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సభ్యులకు వివరించారు. ప్రాణాంతక ఈ రసాయనాన్ని అనేక దేశాల్లో నిషేధించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Paraquat Ban Telangana | కేంద్రానికి నివేదిస్తూ..
పారాక్వాట్ డైక్లోరైడ్ వాడటం వల్ల రైతులు, రైతు కూలీలు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. పలువురు కర్షకులు ప్రాణాలు సైతం కోల్పోయారని అన్నారు.
సుస్థిర సేంద్రియ వ్యవసాయ లక్ష్యాలకు ఈ గడ్డి మందు అడ్డుగా మారిందన్నారు. అందుకే దీని తయారీ, రవాణా, దిగుమతి, వాడకం నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. గడ్డి మందుని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ ఈ సందర్భంగా శాసనసభలో తీర్మానించారు.
Paraquat Ban Telangana | పార్టీల మద్దతు..
కాగా, గడ్డి మందు వినియోగాన్ని నిషేధించడంతో పాటు, రైతులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ తీర్మానానికి పలు పార్టీల సభ్యులు మద్దతు లభించింది. రైతుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం కీలకమని అన్నారు.
