Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Parent Care Salary Cut | తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Parent Care Salary Cut | తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత

తెలంగాణతాజా వార్తలు

Parent Care Salary Cut | తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత

తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టాలని సర్కార్​ యోచిస్తోంది. ఈ మేరకు చట్టం తీసుకు రానుంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 23, 2026 10:48 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
5 రోజులు ago
Share
Parent Care Salary Cut

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Parent Care Salary Cut | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టనుంది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ‘టీఈఏఎంపీఎస్-2026’ (తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్) పేరుతో చట్టం తీసుకు రావాలని యోచిస్తోంది.

Contents
  • Parent Care Salary Cut | 15 శాతం కోత
    • Parent Care Salary Cut | 45 రోజుల్లో..

తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు (Government Jobs) సాధిస్తారు. అయితే అలాంటి తల్లిదండ్రులను ఉద్యోగాలు వచ్చాక చాలా మంది పట్టించుకోవడం లేదు. పెళ్లి కాగానే పేరెంట్స్​ను దూరం పెడుతున్నారు. వృత్తిరిత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న చాలా మంది తల్లిదండ్రులను ఊళ్లలో వదిలేస్తున్నారు. కనీసం ఎలా ఉన్నారని వారానికి ఒకసారి ఫోన్​ చేయడం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచేందుకు చట్టం తీసుకు రానుంది. నేడు జరిగే మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting)లో ఈ బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

Parent Care Salary Cut | 15 శాతం కోత

కొత్త చట్టం ప్రకారం.. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో 15 శాతం లేదా రూ.10 వేలు (ఏది తక్కువైతే అది) కోత విధించనున్నారు. ఎవరైన తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే అధికారులు విచారణ జరుపుతారు. అనంతరం ఆరోపణలు నిజమని తేలితే సదరు ఉద్యోగి జీతం నుంచి కోత పెట్టి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తారు. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఆ మొత్తాన్ని అందరి జీతాల్లో నుంచి సమానంగా కట్​ చేస్తారు.

Parent Care Salary Cut | 45 రోజుల్లో..

పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో జిల్లా కలెక్టరేట్లలో ఫిర్యాదులు చేసే అవకాశం ఉంది. అధికారులు స్పందించి 45 రోజుల్లో సమస్య పరిష్కరిస్తారు. కలెక్టర్ తీర్పుతో సంతృప్తి చెందకపోతే, రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్‌ను ఆశ్రయించే అవకాశం కూడా కల్పించనున్నారు. సొంతంగా పెన్షన్, ఇతర ఆదాయ వనరులు లేకుండా పిల్లలపైనే ఆధారపడిన వృద్ధులకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి..: land acquisition protest | పేదల భూములను గుంజుకుంటే చూస్తూ ఊరుకోం : ఎంపీ ఈటల

Licensed Surveyors | లైసెన్స్​డ్​ సర్వేయర్లకు వేతనం ఇవ్వాలి : హరీశ్​రావు
Nizamabad DJ Issue | డీజే అనుమతి లేదని శోభాయాత్ర అడ్డగింత.. స్వయంగా వాహనం నడిపిన ఎమ్మెల్యే ధన్ పాల్!
 Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన.. రెండో విడతలో వారికి అవకాశం
Stock Market Volatility | వీడని యుద్ధ భయాలు.. లాభనష్టాల మధ్య ఊగిసలాటలో మార్కెట్లు
Kavitha Delhi Liquor Case | నిజం గెలిచింది : కల్వకుంట్ల కవిత
TAGGED:Cabinet MeetingGovernment JobsParent Care Salary CutState Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ishan Kishan SRH Ishan Kishan SRH | SRH ప్రాక్టీస్ మ్యాచ్‌లో హీటెక్కిన సన్నివేశం.. కెప్టెన్‌నే గెటౌట్ అంటూ సైగ చేసిన యువ క్రికెట‌ర్
Next Article QNet Fraud Raids QNet Fraud Raids | ఎంఎల్​ఎం సంస్థ క్యూనెట్​పై సీసీఎస్​ దాడులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?