Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Parental Care Bill | ‘తల్లిదండ్రుల సంరక్షణ చట్టం’ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. సీఎం రేవంత్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Parental Care Bill | ‘తల్లిదండ్రుల సంరక్షణ చట్టం’ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. సీఎం రేవంత్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణతాజా వార్తలు

Parental Care Bill | ‘తల్లిదండ్రుల సంరక్షణ చట్టం’ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. సీఎం రేవంత్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆదివారం ప్రభుత్వ ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లుకు ఆమోదం తెలిపింది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 29, 2026 5:23 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Parental Care Bill

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Parental Care Bill | తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆదివారం ప్రభుత్వ ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లుకు ఆమోదం తెలిపింది. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల వేతనం నుంచి.. రూ.10 వేల వరకు కోత విధించి.. నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమచేసేలా బిల్లును తెచ్చింది. అయితే ఈ చట్టం పరిధిలోకి ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా తీసుకువస్తూ బిల్లుకు ఆమోదం తెలిపారు.

Contents
  • Parental Care Bill | తల్లిదండ్రుల పోషణ బాధ్యత
    • Parental Care Bill | పిల్లల కోసం శక్తిని దారబోసే తల్లిదండ్రులు
      • Parental Care Bill | 2007లో వృద్ధుల కోసం ప్రత్యేక చట్టం

Parental Care Bill | తల్లిదండ్రుల పోషణ బాధ్యత

బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రతిఒక్కరూ తల్లిదండ్రుల పోషణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలనే ఉద్దేశంతో చట్టం తీసుకువచ్చామన్నారు. సామాజిక బాధ్యతగా మా ప్రభుత్వం బిల్లు తెచ్చిందన్నారు. పిల్లలను కనగలం కానీ.. వాళ్ల బుద్ధిని కనలేం అన్నట్టు కొందరి వ్యవహారం ఉందని వ్యాఖ్యానించారు. ప్రేమలు పంచాల్సిన చోట చట్టం తేవాల్సి రావడం బాధగా ఉందన్నారు. భక్తితో లేదా భయంతో అయినా తల్లిదండ్రులను చూసుకోవాలన్నదే మా ఆలోచన అని చెప్పారు. ఉద్యోగులే కాదు ప్రజాప్రతినిధులు కూడా ఈ చట్టంలోకి వస్తారని తెలిపారు. తల్లిదండ్రులను పట్టించుకోని ప్రతి కుమారుడికి బుద్ధి చెప్పాలనే ఈ చట్టం ఉద్దేశమన్నారు.

Parental Care Bill | పిల్లల కోసం శక్తిని దారబోసే తల్లిదండ్రులు

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అన్నారు. పిల్లల కోసం ఎంతో ఆరాట పడతారన్నారు. అలాంటి తల్లిదండ్రులను రెక్కలు వచ్చాక పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రతిఒక్కరూ తల్లిదండ్రులకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే చట్టం తీసుకొచ్చామని రేవంత్‌ చెప్పారు. అయితే సమాజంలో తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వారిని సామాజికంగా బహిష్కరించాలని ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

Parental Care Bill | 2007లో వృద్ధుల కోసం ప్రత్యేక చట్టం

వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం 2007లో ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులకు నెలకు రూ.10 వేలకు మించకుండా ఇవ్వాలని అందులో ఉందని పేర్కొన్నారు. అందుకే తాము తెచ్చిన నూతన చట్టంలో రూ.10 వేల నిబంధన పెట్టినట్లు ఆయన వివరించారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. ప్రజా ప్రతినిధులకు కూడా వర్తిస్తుందని చెప్పారు.

ఇది కూడా చదవండి..: CM Revanth Reddy | కేసీఆర్​ అందుకే సభకు రావడం లేదు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు
Black Monday to Stock Market | స్టాక్ మార్కెట్‌లో బ్లాక్ మండే.. రూ. 7.25 లక్షల కోట్ల సంపద ఆవిరి
Nizamabad Chain Snatching | రెచ్చిపోయిన చైన్​ స్నాచర్లు.. భర్తతో నడుచుకుంటూ వెళ్తుండగానే భార్య మెడలో నుంచి బంగారం చోరీ
Kavitha New Party | కవిత కొత్త పార్టీ పేరు ఇదే..
Chaitra Amavasya | కొత్త అమావాస్య.. పితృదేవతల ఆశీస్సుల కోసం ఉగాదికి ఒకరోజు ముందే చేసే పండగ!
TAGGED:Elderly Care IndiaGovernment Employees RulesIndia Social LawParental Care BillParents Welfare LawRevanth ReddyTelangana Assembly BillTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article North Korea North Korea | మరో ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా.. హై-థ్రస్ట్ మిస్సైల్ ఇంజిన్ పరీక్ష..
Next Article Gandhari Police Case | Gandhari Police Case | గాంధారిలో దారుణం.. బంగారం కోసం అత్తను హతమార్చిన కోడలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?