Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Pawan Kalyan Family Emotional Day | ఏప్రిల్ 8 పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఎమోషనల్ డే.. ఒక కొడుకు బర్త్‌డే, మరో కొడుక్కి పునర్జన్మ!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Pawan Kalyan Family Emotional Day | ఏప్రిల్ 8 పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఎమోషనల్ డే.. ఒక కొడుకు బర్త్‌డే, మరో కొడుక్కి పునర్జన్మ!

సినిమా

Pawan Kalyan Family Emotional Day | ఏప్రిల్ 8 పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఎమోషనల్ డే.. ఒక కొడుకు బర్త్‌డే, మరో కొడుక్కి పునర్జన్మ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఏప్రిల్ 8 ప్రత్యేకమైన రోజు. ఒకవైపు అకిరా నందన్ పుట్టినరోజు వేడుకలు, మరోవైపు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడిన రోజు గుర్తుచేసుకుంటూ కుటుంబం భావోద్వేగానికి లోనవుతోంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 8, 2026 12:12 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
13 గంటలు ago
Share
Pawan Kalyan Family Emotional Day

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pawan Kalyan Family Emotional Day | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుటుంబానికి ఏప్రిల్ 8 ఎప్పటికీ మరువలేని రోజు. ఈ తేదీ వారి జీవితాల్లో సంతోషం, బాధ రెండింటినీ కలగలిపిన ఒక ప్రత్యేక గుర్తుగా నిలిచిపోయింది. మొదటగా, పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ పుట్టినరోజు ఈరోజే. ప్రతి సంవత్సరం ఈ రోజున అభిమానులు సోషల్ మీడియాలో అకిరాకు శుభాకాంక్షలు తెలుపుతూ సందడి చేస్తారు.

Contents
  • Pawan Kalyan Family Emotional Day | అన్నా ఎమోష‌న‌ల్..
    • Pawan Kalyan Family Emotional Day | సింగపూర్ స్కూల్ ఫైర్ యాక్సిడెంట్

గతంలో ఈ రోజు పూర్తి హ్యాపీ మూడ్‌లో గడిచేది. అయితే గత సంవత్సరం జరిగిన ఒక ఘటన ఈ రోజుకు కొత్త అర్థాన్ని తెచ్చింది. పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌ (Singapore)లో చదువుకుంటున్న పాఠశాలలో అనుకోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా, మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ముఖ్యంగా ఊపిరితిత్తులకు ఇబ్బంది తలెత్తడంతో ఆయనకు చికిత్స అందించారు.

Pawan Kalyan Family Emotional Day | అన్నా ఎమోష‌న‌ల్..

ఈ ఘటనతో పవన్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. అయితే వైద్యుల శ్రద్ధతో మార్క్ శంకర్ క్రమంగా కోలుకొని సురక్షితంగా బయటపడటం కుటుంబానికి పెద్ద ఉపశమనం కలిగించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల (Anna Konidela) సోషల్ మీడియాలో స్పందిస్తూ, “ఏప్రిల్ 8 మా కుటుంబానికి ఎమోషనల్ డే” అని పేర్కొన్నారు. మార్క్ శంకర్ (Mark Shankar) ఆరోగ్యంగా తిరిగి రావడంతో పవన్ కుటుంబం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంను దర్శించి తలనీలాలు సమర్పించింది. ఆ ఫోటోలను అన్నా సోషల్ మీడియాలో షేర్ చేయగా, అభిమానులు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు.

Pawan Kalyan Family Emotional Day | సింగపూర్ స్కూల్ ఫైర్ యాక్సిడెంట్

ఇప్పటికీ ఆ సింగపూర్ స్కూల్ ఫైర్ యాక్సిడెంట్ (Fire Accident) కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ ఘటన పవన్ కుటుంబాన్ని ఎంతగా కలిచివేసిందో, అలాగే జీవితం ఎంత విలువైనదో మరోసారి గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 8 వచ్చిందంటే పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఒకవైపు ఆనందం, మరోవైపు భావోద్వేగ క్షణాల మేళవింపుగా మారింది.మ‌రోవైపు అన్నా ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఆస‌క్తిక‌ర విష‌యాలు షేర్ చేసుకుంటుంది.

ఇది కూడా చదవండి..: Trisha Marriage Rumors | రిటైర్మెంట్, పెళ్లి రూమర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష‌.. ఇది చాలా, ఇంకా కావాలా?

Dhurandhar 2 collections | ‘ధురంధర్: ది రివెంజ్’ సంచలనం.. ‘బాహుబలి 2’ రికార్డ్ బ్రేక్
Peddi Movie Postponed | ‘పెద్ది’ రిలీజ్‌పై గందరగోళం.. ఎస్‌కేఎన్ వ్యాఖ్యలపై క్లారిటీ, వాయిదా వార్తలకు చెక్
Bellamkonda Sreenivas Wedding | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి డేట్ ఫిక్స్.. వేదిక ఎక్కడంటే!
Bachupally Fire Accident | బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
Vijay Rashmika Sangeeth Pics | సంగీత్ ఫొటోలతో ట్రెండింగ్‌లో విజయ్–రష్మిక.. ఏమ‌న్నా ఎంజాయ్ చేశారా..!
TAGGED:Anna KonidelaFire AccidentMark ShankarPawan Kalyan Family Emotional DaySingapore
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Stock Market Gains Stock Market Gains | సీజ్ ఫైర్ ఎఫెక్ట్ .. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Next Article Satyashodhak School Satyashodhak School | గ్రామీణ ప్రాంతంలో విద్యా విప్లవం సత్యశోధక్​ పాఠశాల.. 11న సిల్వర్​ జూబ్లీ వేడుకలు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?