అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Peddi Movie Postponed | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
మేకర్స్ ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఊపందుకుంది. దీనికి కారణం నిర్మాత ఎస్‌కేఎన్ (Producer SKN) చేసిన వ్యాఖ్యలే కావడం గమనార్హం. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో ఎస్‌కేఎన్ మాట్లాడుతూ, “జూన్ 26న మా సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. కానీ అదే తేదీకి రామ్ చరణ్ ‘పెద్ది’ వస్తుందని తెలిసింది” అని అన్నారు.
Peddi Movie Postponed | క్షమాపణతో క్లారిటీ ఇచ్చిన ఎస్‌కేఎన్
ఈ వ్యాఖ్యలతో ‘పెద్ది’ కొత్త రిలీజ్ డేట్ జూన్ 26 అని ప్రచారం మొదలైంది. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఈ వివాదంపై స్పందించిన ఎస్‌కేఎన్ ఓ వీడియో విడుదల చేస్తూ క్లారిటీ ఇచ్చారు. “ఈవెంట్‌లో ఒక చిన్న మిస్ కమ్యూనికేషన్ జరిగింది. ‘పెద్ది’ రిలీజ్ డేట్ గురించి స్పష్టత లేకపోయినా, సోషల్ మీడియా (Social Media)లో వచ్చిన సమాచారం ఆధారంగా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను” అని తెలిపారు. అలాగే, “వేదికపై ఆ ఉత్సాహంలో ‘పెద్ది’ రిలీజ్ గురించి నేను చెప్పిన మాటలు తప్పుగా కన్వే అయ్యాయి. అసలు విషయం తరువాత తెలిసింది. దీనివల్ల గందరగోళం ఏర్పడినందుకు క్షమించాలి” అని అన్నారు.
Peddi Movie Postponed | వాయిదా వార్తలకు కొంతవరకు చెక్
ఎస్‌కేఎన్ పూర్తి క్లారిటీ ఇస్తూ.. పెద్ది సినిమా వాయిదా పడిందనే విషయాన్ని ఎక్కడా వినలేదు. ఎలాంటి మార్పులు ఉంటే మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారు” అని తెలిపారు. దీంతో ఇప్పటివరకు వస్తున్న వాయిదా వార్తలకు కొంతవరకు చెక్ పడినట్లైంది. ప్రస్తుతం సినిమా ఏప్రిల్ 30న విడుదల అవుతుందనే అంచనాలు కొనసాగుతున్నాయి. మరోవైపు రామ్ చరణ్ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. రిలీజ్ డేట్‌పై అధికారిక క్లారిటీ వచ్చే వరకు ఈ చర్చలు కొనసాగనున్నాయి. అయితే తాజాగా వచ్చిన వివరణతో అభిమానుల్లో కొంత ఊరట కలిగింది.
ఇది కూడా చదవండి..: Sharwanand Biker Transformation | ‘బైకర్’ కోసం శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్.. రోజుకు 32 కి.మీ పరుగులు, రెండేళ్లు కఠిన సాధన
