అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pending Works Completion | ఎల్లారెడ్డిలో (Yellareddy) ఇటీవల వచ్చిన వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న లింగంపల్లి ఖుర్ద్ వంతెన, ఆడివి లింగాల వంతెనతో పాటు ఇతర పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన ఎల్లారెడ్డిలో నియోజకవర్గంలోని పలు సమస్యలపై మాట్లాడారు.
Pending Works Completion | లింగంపల్లి ఖుర్ద్ వంతెన..
లింగంపల్లి ఖుర్ద్ వంతెన (Lingampalli Khurd Bridge), అడివిలింగాల వంతెనలు నాగిరెడ్డిపేట, లింగంపేట, ఎల్లారెడ్డి మండలాల మధ్య రాకపోకలకు కీలకమని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో, ఈ మార్గాలు రైతులకు అత్యంత ప్రాధాన్యత కలిగినవన్నారు. వారి వ్యవసాయ కార్యకలాపాలకు ప్రధాన రవాణామార్గాలుగా ఉపయోగపడుతున్నాయని వివరించారు.
Pending Works Completion | పాత వంతెనలతో ఇబ్బందులు..
సదాశివనగర్, గాంధారి, రాజంపేట, తాడ్వాయి, రామారెడ్డి మండలాల్లో పాత వంతెనలు ఏళ్లక్రితం కట్టినవని.. వాటితో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ, ఆర్అండ్బీ శాఖల ద్వారా తక్షణమే నిధులు విడుదల చేసి, వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇటీవల వచ్చిన భారీ వరదల కారణంగా మండల కేంద్రాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. కొన్ని కార్యాలయాలు పాతవి ఉండగా, మరికొన్ని నిధుల కొరత కారణంగా నిర్మాణంలోనే నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించేందుకు తక్షణ నిధులు మంజూరు చేసి, ప్రభుత్వ కార్యాలయాల మరమ్మతులు, నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి దృష్ట్యా పెండింగ్‌లో ఉన్న వంతెనలు, ప్రభుత్వ భవనాల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని.. వెంటనే నిధులు మంజురు చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు.
ఇది కూడా చదవండి..: Kaleshwaram Package Works | కాళేశ్వరం ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

