అక్షరటుడే, వెబ్డెస్క్: Petrol Bunk Rush Hyderabad | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కొనసాగుతోంది. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తుండటంతో భయంతో వాహనదారులు గంటల తరబడి లైన్లో ఉండి మరి పెట్రోల్ కొట్టించుకున్నారు.
పెట్రోల్, డీజిల్ దొరకదని పుకార్లు వ్యాపించాయి. దీంతో బుధవారం నుంచి రాష్ట్రంలో వాహనదారులు పెట్రోల్ బంక్ (Petrol Pump)లకు బారులు తీరారు. అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేశారు. కొందరు ట్యాంక్లు ఫుల్ చేసుకోగా.. మరికొందరు క్యాన్లు, డబ్బాల్లో నింపుకొని ఇళ్లకు వెళ్లారు. దీంతో పలు పెట్రోల్ బంక్ల్లో స్టాక్ అయిపోయింది. బుధవారం కిలోమీటర్ల మేర బంక్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. అధికారులు పెట్రోల్ కొరత లేదని స్పష్టత ఇచ్చారు. వాహనదారులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో గురువారం పరిస్థితి కాస్తా అదుపులోకి వచ్చింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వాహనాల రద్దీ తక్కువగా ఉంది.
Petrol Bunk Rush Hyderabad | భయంతో..
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కనిపిస్తోంది. పెట్రోల్ దొరకదేమోననే భయంతో ముందస్తు జాగ్రత్తగా స్టాక్ ఉంచుకోవాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. దీంతో గంటల తరబడి వేచి ఉంటూ తిప్పలు పడుతున్నారు. పెట్రోల్ కొరత లేదని, ఆందోళన వద్దని ఆయిల్ కంపెనీలు, ప్రభుత్వం తెలిపింది.
Petrol Bunk Rush Hyderabad | కొరత లేదు
హైదరాబాద్ నగరంలోని పలువురు డీలర్లు మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ నిరంతరాయంగా సరఫరా అవుతోందని తెలిపారు. ఇంధన కొరత అస్సలు లేదన్నారు. వదంతులు, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు. ఇటువంటి తప్పుడు సమాచారం పెట్రోల్ బంకుల వద్ద అనవసరమైన రద్దీకి దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Petrol Bunk Rush Hyderabad | సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు యత్నం
గ్యాస్ ఆటో నుంచి సిలిండర్లు (Cylinders) ఎత్తుకెళ్లేందుకు వినియోగదారులు యత్నించారు. హైదరాబాద్ నగరంలోని ఫిలింనగర్ పరిధిలోని షేక్‌పేట్ వద్ద గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్లతో ఆటో బయటకు వచ్చింది. ఆటోను చూడగానే.. వినియోగదారులు అనుమతి లేకుండా సిలిండర్లు తీసుకొని వెళ్లేందుకు యత్నించారు. స్థానికుల సహాయంతో వారిని ఏజెన్సీ సిబ్బంది అడ్డుకున్నారు. గ్యాస్ బుక్ చేసి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా సిలిండర్ రాలేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Kulsum Pura ACP Tirupati | కుల్సుంపురా ఏసీపీగా తిరుపతి బాధ్యతల స్వీకరణ

