అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Petrol Excise Duty Cut | కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో పలు దేశాల్లో ఇంధన ధరలను పెంచగా.. కేంద్రం మాత్రం పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలతో నష్టాల్లో ఉన్న ఆయిల్ కంపెనీలకు ఉపశమనం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఆయిల్ కంపెనీలపై ఒత్తిడి తగ్గిస్తూ రిటైల్ ధరలు పెంచకుండా.. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దీంతో కేంద్రం విధించే పన్నులు లీటరు పెట్రోల్‌పై రూ.3కి, డీజిల్‌పై సున్నాకు తగ్గాయి. అయితే ఈ తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం లేదు.
Petrol Excise Duty Cut | నష్టాలు భర్తీ చేయడానికి..
పశ్చిమాసియాలో యుద్ధంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. అయినా కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచలేదు. నష్టాలను ఆ సంస్థలే భరిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వాటి నష్టాలు తగ్గించడానికి ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అమ్మే ప్రతి లీటరు పెట్రోల్ లేదా డీజిల్‌పై రూ.48.8 నష్టపోతున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం, హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) దిగ్బంధనం తర్వాత ప్రపంచ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల ప్రమాదకర స్థాయిని దాటడమే దీనికి కారణం.
Petrol Excise Duty Cut | కేంద్రంపై భారం
గత నెలలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు సుమారు 70 డాలర్ల నుండి 122 డాలర్లకు పెరిగాయని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. దీంతో ఆగ్నేయాసియా దేశాల్లో ఇంధన ధరలు సుమారు 30 నుంచి 50 శాతం, ఉత్తర అమెరికా (North America) దేశాలలో 30 శాతం, యూరప్‌లో 20 శాతం, ఆఫ్రికా దేశాలలో 50 శాతం పెరిగాయన్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం ప్రజలపై భారం మోపకుండా.. ఆర్థిక వ్యవస్థపై భారాన్ని మోపిందన్నారు. దీంతో కేంద్ర ఖజానాకు నష్టం వాటిల్లనుంది.
ఇది కూడా చదవండి : Nayara Fuel Price Hike | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచిన ‘నయారా’

