అక్షరటుడే, వెబ్‌డెస్క్: Petrol Shortage Rumors | రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంక్‌లకు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంలోని పలు బంక్‌ల్లో స్టాక్ అయిపోయింది. మిగతా బంక్‌ల్లో వాహనదారులు భారీగా బారులు తీరారు. ఈ క్రమంలో డీలర్స్ అసిసోయేషన్ కీలక ప్రకటన చేసింది.
రాష్ట్రంలో ఇంధన కొరత లేదని తెలంగాణ డీలర్స్ అసోసియేషన్ (Telangana Dealers Association) ప్రకటించింది. ఇంధన కొరతపై వస్తున్న వార్తలను ఖండించింది. HPCL, IOCL, BPCL పెట్రోలియం కంపెనీల్లో సరిపడా నిలువలు ఉన్నాయని తెలిపింది. పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవద్దని, అవసరానికి తగ్గట్టు కొనుగోలు చేయాలని కోరింది. ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్‌లపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దంటూ ప్రకటన విడుదల చేసింది.
Petrol Shortage Rumors | భారీగా ట్రాఫిక్ జామ్
పెట్రోల్, డీజిల్ దొరకదని ప్రచారం జరగడంతో ప్రజలు బంక్‌లకు పరుగులు తీశారు. అవసరానికి మించి పెట్రోల్ కొనుగోలు చేశారు. కొందరైతే క్యాన్లలో నింపుకెళ్లారు. దీంతో పలు బంక్‌ల్లో స్టాక్ అయిపోయింది. నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో ప్రజలు మరింత భయపడి పెట్రోల్ కోసం బంక్‌ల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) నగరంలో వాహనదారులు భారీగా బారులు తీరారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) వాహనాలను దారి మళ్లిస్తున్నారు. పోలీసులు బంక్‌ల వద్ద బందోబస్తు చేపట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Petrol Shortage Rumors | తప్పుడు ప్రచారంతో..
పెట్రోల్ కొరత ఉందంటూ తప్పుడు ప్రచారం జరగడంతోనే ప్రజలు బంక్‌లకు బారులు తీరారని డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. జనం భారీగా రావడంతో మాములు రోజులకంటే విక్రయాలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగాయని వెల్లడించింది. దీంతో స్టాక్ అయిపోతున్నట్లు తెలిపింది. ఇది పెరిగిన డిమాండ్‌తో ఏర్పడిన సమస్య అని పేర్కొంది. సరఫరాలో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేసింది.
Petrol Shortage Rumors | సమీక్షించనున్న సీఎం
రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు (ఎల్పీజీ), యూరియా నిల్వలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. నేడు మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభ కమిటీ హాల్లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.
ఇది కూడా చదవండి..: Indigo Emergency Landing | ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

