Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Petrol Shortage Rumors | పెట్రోల్​ కష్టాలు.. బారులు తీరిన వాహనదారులు.. అసలు కారణమిదే?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Petrol Shortage Rumors | పెట్రోల్​ కష్టాలు.. బారులు తీరిన వాహనదారులు.. అసలు కారణమిదే?

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Petrol Shortage Rumors | పెట్రోల్​ కష్టాలు.. బారులు తీరిన వాహనదారులు.. అసలు కారణమిదే?

పెట్రోల్​, డీజిల్ దొరకదని పుకార్లు వ్యాపించాయి. దీంతో వాహనదారులు బంక్​ల వద్ద బారులు తీరారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 25, 2026 10:29 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Petrol Shortage Rumors

అక్షరటుడే, వెబ్​డెస్క్: Petrol Shortage Rumors | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోల్​, డీజిల్​ కొరత వస్తుందని పుకార్లు వ్యాపించాయి. దీంతో వాహనదారులు బంక్​లకు బారులు తీరారు. హైదరాబాద్​ (Hyderabad) నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని బంక్​ల్లో వాహనదారుల రద్దీ నెలకొంది.

Contents
  • Petrol Shortage Rumors | కిలోమీటర్ల మేర క్యూ..
    • Petrol Shortage Rumors | కొరతకు కారణమిదే..
      • Petrol Shortage Rumors | అడ్వాన్స్​గా చెల్లింపులు
        • Petrol Shortage Rumors | కొరత లేదు

యుద్ధం ప్రభావంతో చమురు సరఫరాలో అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. గల్ఫ్​ దేశాల నుంచి ముడి చమురు రవాణా నిలిచిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇతర దేశాల నుంచి దిగుమతులను పెంచింది. అయినా కూడా పెట్రోల్​, డీజిల్​ దొరకదని పుకార్లు వ్యాపించాయి. వాహనదారులు పెద్ద ఎత్తున బంక్​లకు బారులు తీరారు. పలు బంక్​ల్లో నో స్టాక్​ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. దీంతో పెట్రోల్​ ఉన్న బంక్​లకు వాహనదారులు పరుగులు పెడుతున్నారు.

Petrol Shortage Rumors | కిలోమీటర్ల మేర క్యూ..

ప్రజలు భయంతో అవసరానికి మించి పెట్రోల్​ కొనుగోలు చేస్తున్నారు. దీంతో పలు బంక్​ల్లో స్టాక్​ అయిపోయింది. మిగతా బంక్​ల్లో కూడా స్టాక్​ అయిపోతే తమకు ఇంధనం దొరకదేమోనని ప్రజలు భారీగా బారులు తీరారు. హైదరాబాద్​ శివారులోని తెలంగాణ పోలీసు అకాడమీ వద్ద గత ఓ బంక్​లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్​ కోసం వాహనాలు బారులు తీరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ నిలిచిపోయింది.

Petrol Shortage Rumors | కొరతకు కారణమిదే..

హైదరాబాద్‌లో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరతకు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే కారణమని తెలుస్తోంది. చమురు కంపెనీలు, పెట్రోల్ పంపు యజమానుల మధ్య ఉన్న వివాదం కారణంగా కొరత ఏర్పడిందని సమాచారం. దీంతో హైదరాబాద్​లోని పలు బంక్​ల్లో నో స్టాక్​ బోర్డు దర్శనం ఇస్తోంది. రెండు రోజులుగా చమురు కంపెనీలు ఇంధనం కొనుగోళ్లకు క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేశాయి. పెట్రోల్ బంక్​లు (Petrol Bunks) క్రెడిట్‌పై ఇంధనాన్ని పొంది రెండు రోజుల తర్వాత చమురు కంపెనీలకు డబ్బులు చెల్లించేవి.

Petrol Shortage Rumors | అడ్వాన్స్​గా చెల్లింపులు

చమురు కంపెనీలు ఇంధనాన్ని సరఫరా చేయడానికి అడ్వాన్స్ చెల్లింపును తప్పనిసరి చేశాయి. ఇటీవల కొత్త నిబంధనను ప్రవేశ పెట్టాయి. పాత బకాయిలను చెల్లించాలని, కొత్త స్టాక్ కోసం ముందుగానే డబ్బులు ఇవ్వాలని చెప్పడంతో అనేక బంక్​లు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి.

Petrol Shortage Rumors | కొరత లేదు

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌కు కొరత లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు భయపడి, అవసరానికి మించి కొనుగోలు చేయొద్దని సూచించారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. వదంతులతోనే పెట్రోల్​ బంక్​ల వద్ద క్యూలైన్లు దర్శనం ఇస్తున్నాయని తెలిపారు.

MORE QUEUES!!!
THIS TIME FOR PETROL & DIESEL!

While there are considerable queues at LPG centers, since yesterday there are frustratingly longer & more panic inducing queues at petrol bunks across the city.

Almost 50 percent petrol bunks in Hyderabad have “no stock” boards!… pic.twitter.com/eYvJL11LfO

— Revathi (@revathitweets) March 25, 2026

 

ఇది కూడా చదవండి..: LPG Booking Rules | సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ మరింత కఠినతరం!

Sugar Daddy Parties | బెంగళూరులో ‘షుగర్ డాడీ–షుగర్ బేబీ’ పార్టీలు.. గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి…
Inter Exams 2026 | ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు
Hair Wash Frequency | వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలో తెలుసా..!
Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం
Karimnagar ACB Arrest | యూపీఐ ద్వారా లంచాలు.. ఏసీబీకి చిక్కిన సూపరింటెండెంట్
TAGGED:Central GovernmentDiesel Shortagefuel queuesHyderabadHyderabad newsindia newsoil companies disputepanic buyingPetrol BunksPetrol Shortage Rumors
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Trump Iran Peace Plan Trump Iran Peace Plan | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు ముగింపు దిశగా అడుగులు.. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు శాంతి ప్రణాళిక
Next Article Indigo Emergency Landing Indigo Emergency Landing | ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?