Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: PF Withdrawal App | పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభం.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి కొత్త మొబైల్ యాప్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - PF Withdrawal App | పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభం.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి కొత్త మొబైల్ యాప్

జాతీయం

PF Withdrawal App | పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభం.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి కొత్త మొబైల్ యాప్

ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవడానికి ఇకపై రోజుల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు.

Srinivas kolluri
Last updated: మార్చి 27, 2026 3:38 సా.
Srinivas Kolluri
10 గంటలు ago
Share
PF Withdrawal App

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PF Withdrawal App | ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌ (Provident Fund Organization) తో దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్లకుపైగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు అనుబంధం ఉంది. ప్రతినెలా ఉద్యోగుల బేసిక్ పే నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలోకి చేరుతోంది. అయితే గతంలో పీఎఫ్ నగదు విత్‌డ్రా చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. పీఎఫ్ ఉపసంహరణకు దరఖాస్తు చేసిన తర్వాత కొంత కాలం వేచి ఉండాల్సి వస్తోంది.

Contents
  • PF Withdrawal App | 75 శాతం విత్‌డ్రాకు అవకాశం
    • PF Withdrawal App | యాప్‌లోని ముఖ్య సౌకర్యాలు..

తన ఖాతాదారులు యూపీఐ (UPI) ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాకు పీఎఫ్ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటు కల్పించడం కోసం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో కొత్త యాప్‌ను తీసుకువస్తోంది. ఆ యాప్ వచ్చాక పీఎఫ్ ఉపసంహరణకోసం వేచి ఉండాల్సిన సమయం గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ డాక్యుమెంటేషన్ కూడా అవసరం ఉండదు. ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా ఆధార్ ఓటీపీ మరియు బయోమెట్రిక్ ధ్రువీకరణతో సురక్షితంగా లావాదేవీలు జరపవచ్చని సంస్థ పేర్కొంటోంది.

PF Withdrawal App | 75 శాతం విత్‌డ్రాకు అవకాశం

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన సభ్యులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు కొత్త మొబైల్ యాప్‌ (New Mobile App)ను తీసుకువస్తోంది. ఇది ఏప్రిల్ 1 నుంచి అందుబాటులో ఉండనుంది. దీని ద్వారా సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు యూపీఐ లేదా ఏటీఎం ద్వారా తక్షణం లేదా 24 గంటల్లో ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 25 శాతం మొత్తాన్ని రిటైర్మెంట్ ఫండ్ కోసం ఖాతాలో ఉంచడం తప్పనిసరి. ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. మిగిలిన 25 శాతం పీఎఫ్‌ను నిర్ణీత సమయం తర్వాత మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏప్రిల్ ఒకటో తేదీనుంచి యాప్ అందుబాటులోకి రానుంది. తదుపరి సమాచారం కోసం ఈపీఎఫ్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

PF Withdrawal App | యాప్‌లోని ముఖ్య సౌకర్యాలు..

యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాకు డబ్బు బదిలీ అవుతుంది.
ఏటీఎం నుంచి కూడా పీఎఫ్ సొమ్ము విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉన్న మొత్తాన్ని యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
రూ. 5 లక్షల వరకు ఆటో సెటిల్‌మెంట్ (వేగవంతమైన ప్రాసెసింగ్) సౌకర్యం ఉంటుంది.
పాస్‌బుక్ బ్యాలెన్స్, నామినీ అప్‌డేట్, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ వంటి సేవలు కూడా దీని ద్వారా పొందవచ్చు.

ఇది కూడా చదవండి : Ram Navami in Vemulawada | వేములవాడలో ఘనంగా శ్రీరామనవమి.. వివాహం చేసుకున్న హిజ్రాలు

 

Nayara Fuel Price Hike | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచిన ‘నయారా’
CA Results 2026 | సీఏ ఫలితాలు విడుదల
Seema Anand Controversy | తెరపైకి సెక్స్​ ఎడ్యుకేటర్​ సీమా ఆనంద్ వివాదం.. పోడ్‌కాస్ట్ వ్యాఖ్యలపై చర్చ!
West Asia Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై మంత్రి జైశంకర్​ ప్రకటన
Iran Israel War live updates | ఇరాన్​ అధ్యక్షుడికి భారత్​ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!​
TAGGED:New Mobile AppPF Withdrawal AppProvident Fund OrganizationUPI
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Sita Rama Kalyanam Sita Rama Kalyanam | ఇందూరు తిరుమలలో కనుల పండువగా సీతారామ కల్యాణం
Next Article Kavitha New Party Kavitha New Party | ఏప్రిల్ 25న కొత్త పార్టీ.. కవిత కీలక ప్రకటన
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Lockdown Rumors | లాక్ డౌన్ దిశగా అడుగులు..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?