అక్షరటుడే, వెబ్డెస్క్ : Pista House biryani issue | హైదరాబాద్ (Hyderabad) బిర్యానీ అంటే చాలా మంది లొట్టలేసుకుంటూ తింటారు. దీంతో నగరంలో అనేక హోటళ్లలో బిర్యానీ దొరుకుతుంది. అయితే పలు హోటళ్లలో బిర్యానీ బాగుంటుందనే టాక్ ఉంది. అలాగే పిస్తాహౌస్ బిర్యానీకి సైతం మంచి పేరుంది. ఈ క్రమంలో ఆ హోటల్లో బిర్యానీ తినడానికి వెళ్లిన కస్టమర్లకు షాకింగ్ ఘటన ఎదురైంది. బిర్యానీలో ఈగలు, బొద్దింక రావడంతో వారు షాక్ అయ్యారు.
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట (Pedda Ambarpet)లో గల ‘పిస్తా హౌజ్ రెస్టారెంట్ మండీ’లో వడ్డించిన బిర్యానీతో పాటు ఇచ్చిన సాలన్‌లో బొద్దింక, ఈగలు వచ్చాయి కుంట్లూరుకు చెందిన పలువురు రెస్టారెంట్లో బిర్యానీ తినడానికి వెళ్లారు. అయితే సాలన్‌లో బొద్దింక, ఈగ, దోమలు కనిపించాయి. దీంతో వారు యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే రెస్టారెంట్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pista House biryani issue | రెస్టారెంట్ ఎదుట ఆందోళన
సిబ్బంది తీరును నిరసిస్తూ బాధితులు రెస్టారెంట్ ఎదుట ధర్నా చేశారు. ఈ ఘటనపై అధికారులకు సైతం ఫిర్యాదు చేశామన్నారు. చాలా మందికి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో బిర్యానీని వదిలేసి వెళ్లారన్నారు. పరిశుభ్రత పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆహార భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Pista House biryani issue | బయట తినాలంటే భయం
హైదరాబాద్ నగరంలో బయట ఏదన్న తినాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల టాస్క్ఫోర్స్ (Taskforce) అధికారుల దాడుల్లో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాల నుంచి మొదలు పెడితే అన్ని వస్తువులను కల్తీ చేస్తున్నారు. వాటిపై పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. అయితే పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా నిబంధనలు పాటించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లపై సైతం దాడులు చేయాలని కోరుతున్నారు.
దీనిని కూడా చదవండి : Illegal Bakery | అక్రమంగా నిర్వహిస్తున్న బేకరీపై పోలీసుల దాడి
