అక్షరటుడే, ఎల్లారెడ్డి: Plant Maintenance | మొక్కల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పల్లెప్రకృతి వనాలు, ఇందిరమ్మ ఇళ్ల (Indiramma House) నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
Plant Maintenance
Plant Maintenance | మొక్కల పెరుగుదల, నిర్వహణపై సమీక్ష..
ఈ సందర్భంగా పల్లెప్రకృతి వనంలో నాటిన మొక్కల పెరుగుదల, నిర్వహణ పనులను కలెక్టర్ సమీక్షించారు. పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు బాగా పెరిగేలా ప్రతిరోజూ నీరు పోయడం, పిచ్చిమొక్కలను తొలగించడం, శుభ్రత పాటించడం, క్రమం తప్పకుండా నిర్వహణ (మెయింటెనెన్స్) పనులు చేయడం ఎంతో ముఖ్యమని కలెక్టర్ (Collector Ashish Sangwan) తెలిపారు. మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవి చెట్లుగా ఎదిగే వరకు నిరంతరంగా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలను కాపాడాలని ఆయన కోరారు.
Plant Maintenance | ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన..
గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని, ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎల్పీవో శ్రీనివాస్, వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Collector Inspection | మైనారిటీ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


