అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Kisan 22nd Installment | కేంద్ర ప్రభుత్వం (Central Government) నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనుంది. 22వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేస్తారు. 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,640 కోట్లు జమ కానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM Kisan Samman Nidhi Scheme) ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఏడాదికి ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 వేలు అందజేస్తోంది. రూ.రెండు వేల చొప్పున మూడు విడతల్లో నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. అస్సాంలోని గౌహతిలో ప్రధాని మోదీ (Prime Minister Modi) 22వ విడత నిధులను నేడు విడుదల చేయనున్నారు. ఈ విడత మొత్తాన్ని ‘ప్రత్యక్ష ప్రయోజన బదిలీ’ (DBT) విధానం ద్వారా లబ్ధిదారులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తారు.
PM Kisan 22nd Installment | మీ పేరుందా..
ప్రభుత్వం కేవైసీ చేసుకోని పలువురు లబ్ధిదారులను పేర్లను అర్హుల జాబితా నుంచి తొలగించింది. దీంతో ప్రస్తుతం పీఎం కిసాన్ నిధులు వస్తాయో లేదో రైతులు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. జాబితాను తనిఖీ చేయడానికి, రైతులు అధికారిక PM-KISAN వెబ్‌సైట్‌ను సందర్శించాలి. హోమ్‌పేజీలో, “Beneficiary List” (లబ్ధిదారుల జాబితా) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ రాష్ట్రం, జిల్లా, మండలం పేరు ఎంచుకోవాలి. గ్రామాన్ని సెలెక్ట్ చేశాక.. “Get Report” పై క్లిక్ చేస్తే గ్రామంలోని అర్హుల జాబితా వస్తుంది.
PM Kisan 22nd Installment | నవంబర్‌లో..
ఈ పథకం 21వ విడత నిధులు గతేడాది నవంబర్ 19న ప్రధాని విడుదల చేశారు. ఆ సమయంలో, 9 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందగా, రూ. 18,000 కోట్లకు పైగా నిధులు బదిలీ చేయబడ్డాయి. కాగా రైతుల పేర్లు జాబితాలో లేకపోతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. e-KYC ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఇది కూడా చదవండి..: Iran Israel War live updates | ఇరాన్ అధ్యక్షుడికి భారత్ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!

