Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: PNG Connections India | పెరిగిన పీఎన్‌జీ కనెక్షన్లు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - PNG Connections India | పెరిగిన పీఎన్‌జీ కనెక్షన్లు..

జాతీయం

PNG Connections India | పెరిగిన పీఎన్‌జీ కనెక్షన్లు..

భారత్ తన పైప్డ్ నేచురల్ గ్యాస్( పీఎన్‌జీ) నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. మార్చిలో 3.1 లక్షలకు పైగా కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభం కాగా.. మరో 2.7 లక్షల కనెక్షన్లు మంజూరు చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 1:21 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
PNG Connections India

అక్షరటుడే, వెబ్​డెస్క్: PNG Connections India | పశ్చిమాసియాలో నెలన్నరగా జరుగుతున్న యుద్ధం కారణంగా వంటగ్యాస్ సరఫరాలో జాప్యం జరుగుతోంది. హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలతో దేశంలో ఎల్‌పీజీ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.

Contents
  • PNG Connections India | గ్యాసిఫైడ్ కనెక్షన్లు అంటే..
    • PNG Connections India | గ్యాస్ కొరత లేదంటున్న సర్కారు

పశ్చిమాసియాలో యుద్ధం వంటగ్యాస్ ఎల్పీజీ సరఫరా (LPG supplies)లకు అంతరాయం కలిగిస్తుండడంతో ప్రభుత్వం పైప్డ్ నేచురల్ గ్యాస్( పీఎన్‌జీ) నెట్‌వర్క్ విస్తరణకు ప్రాధాన్యత ఇస్తోంది. ప్రధానంగా నగరాలలోని గృహాలు, వ్యాపారాల కోసం పీఎన్‌జీ ని ప్రోత్సహిస్తోంది. రీఫిల్స్ బుక్ చేసుకునే శ్రమ లేకుండా గ్యాస్ పైప్‌లైన్ ద్వారా నేరుగా ఇంటికే సరఫరా అవుతుంది కాబట్టి రోజువారీ వినియోగానికి ఎల్పీజీ సిలిండర్ల కంటే ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పీఎన్‌జీ కనెక్షన్‌లు (PNG Connections) పెరుగుతున్నాయి. గత నెలలో 3.1 లక్షలకు పైగా కనెక్షన్లకు గ్యాసిఫికేషన్ చేశారు. దీనికితోడు మరో 2.7 లక్షల కనెక్షన్లను జారీ చేశారు. మరోవైపు ఇదే సమయంలో 6వేల మంది పీఎన్‌జీ వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్లను వదులుకోవడం గమనార్హం.

PNG Connections India | గ్యాసిఫైడ్ కనెక్షన్లు అంటే..

భారతదేశం (India)లో ఫిబ్రవరి నెలాఖరు నాటికి 1.64 కోట్ల దేశీయ పీఎన్‌జీ కనెక్షన్లు, 48,568 వాణిజ్య, 21,512 పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. మార్చిలో 3.1 లక్షల గ్యాసిఫైడ్ కనెక్షన్లు ఇచ్చారు. గ్యాసిఫైడ్ కనెక్షన్లు అంటే అంతకు ముందు నెలల్లో దరఖాస్తు చేసుకుని, మార్చిలో కనెక్ట్ చేయబడి, గ్యాస్ సరఫరా ప్రారంభమైనవి. అంతేకాకుండా ఈనెలలో 2.7 లక్షల కొత్త పీఎన్‌జీ కనెక్షన్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. వాటికి గ్యాస్ సరఫరా ప్రారంభించే ప్రక్రియ కొనసాగుతోంది.

PNG Connections India | గ్యాస్ కొరత లేదంటున్న సర్కారు

గృహాలు, వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలకు పీఎన్‌జీ సరఫరాను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, జాతీయ విస్తరణ కార్యక్రమాన్ని జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తోందని కేంద్రం తెలిపింది. హాస్టళ్లు, కమ్యూనిటీ కిచెన్‌లు, విద్యా సంస్థలతో సహా అన్ని సంస్థలకు కనెక్షన్లను వేగవంతం చేయాలని నగర గ్యాస్ పంపిణీదారులను ఆదేశించింది. దేశంలో ఎల్‌పీజీ పంపిణీ స్థిరంగా కొనసాగుతోందని, డీలర్‌ల వద్ద ఎలాంటి కొరత ఉన్నట్లు నివేదికలు లేవని, మార్చిలో రోజువారీ సిలిండర్ డెలివరీలు సగటున 50 లక్షలకు పైగా ఉన్నాయని తెలిపింది.

ఇది కూడా చదవండి..: RBI MPC Meeting | అందరి చూపు ఆర్‌బీఐ వైపు!.. మూడు రోజుల ఎంపీసీ మీటింగ్ ప్రారంభం

 

Ladakh Donation Auctions | గుడ్డు రూ. 6 వేలు.. ఆపిల్ రూ. 1.05 లక్షలు..
Mohsina Kidwai Death | కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ కన్నుమూత
Crude Oil Effect | క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
Cement Price Hike | భారీగా పెరగనున్న సిమెంట్‌ ధరలు.. రేపటి నుంచే..
LPG Ship India | గ్యాస్​ కష్టాలకు చెక్​… భారత్‌కు చేరిన మరో ఎల్పీజీ నౌక
TAGGED:energy infrastructuregasificationIndiaIndia gas supplyLPG alternativeLPG suppliesMarch 2026 updatepiped natural gasPNG ConnectionsPNG Connections IndiaStrait of Hormuzurban utilities
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article US Israel Attack US Israel Attack | ఇరాన్​పై అమెరికా–ఇజ్రాయెల్​ దాడులు.. 17 మంది మృతి
Next Article BJP Foundation Day | BJP Foundation Day | కమ్మర్‌పల్లిలో ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?