అక్షరటుడే, వెబ్‌డెస్క్: POCSO Case Sentence | బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడికి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. హకా భవన్‌లోని పోక్సో (POCSO) చట్టం కేసుల ప్రత్యేక సెషన్స్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు ఈ మేరకు తీర్పు వెల్లడించారు.
చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ (Chandrayangutta Police Station) పరిధిలోని జి.ఎం. కాలనీకి చెందిన అబ్దుల్ ఖయ్యూమ్ (23) ఓ బాలికకు అరబిక్ ట్యూషన్ చెప్పేవాడు. 2019లో ఒకరోజు ట్యూషన్ సమయంలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, సెల్ ఫోన్ ఆశ చూపి బాలికపై లైంగిక దాడి చేయడానికి యత్నించాడు. దీంతో బాలిక గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పరారు అయ్యాడు.
POCSO Case Sentence | తల్లి ఫిర్యాదు మేరకు..
బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు (Chandrayangutta Police) కేసు నమోదు చేశారు. ఆధారాలు సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడు అబ్దుల్ ఖయ్యూమ్‌ను దోషిగా నిర్ధారించారు. నిందితుడికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానాతో పాటు బాధిత బాలికకు రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఎస్సైలు జాకీర్ జకీర్ హుస్సేన్, వెంకటేష్‌ను సీపీ సజ్జనార్ (CP Sajjanar) అభినందించారు.
ఇది కూడా చదవండి..: Adulterated Ginger Garlic Paste | అసిటిక్ యాసిడ్ – గమ్ పౌడర్‌తో అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారీ.. రెండు టన్నుల కల్తీ సరకు పట్టివేత!

