Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Polavaram Tiger Alert | కాకినాడ నుంచి పోలవరం వ‌ర‌కు పెద్దపులి సంచారం.. గ్రామాల్లో భయాందోళనలు, అటవీ శాఖ అప్రమత్తం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Polavaram Tiger Alert | కాకినాడ నుంచి పోలవరం వ‌ర‌కు పెద్దపులి సంచారం.. గ్రామాల్లో భయాందోళనలు, అటవీ శాఖ అప్రమత్తం

ఆంధ్రప్రదేశ్​

Polavaram Tiger Alert | కాకినాడ నుంచి పోలవరం వ‌ర‌కు పెద్దపులి సంచారం.. గ్రామాల్లో భయాందోళనలు, అటవీ శాఖ అప్రమత్తం

కాకినాడ నుంచి బయలుదేరిన పెద్దపులి పోలవరం జిల్లాలోకి ప్రవేశించడంతో సమీప గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 20, 2026 10:24 ఉద.
Srinivas Kolluri
7 రోజులు ago
Share
Polavaram Tiger Alert

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Polavaram Tiger Alert | ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా (Kakinada District)లో కొద్ది రోజులుగా కలకలం సృష్టిస్తున్న పెద్దపులి ఇప్పుడు పోలవరం జిల్లాలోకి ప్రవేశించడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. అటవీ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రాజవొమ్మంగి మండలం (Rajavommangi Mandal) ఉర్లకులపాడు గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది.

Contents
  • Polavaram Tiger Alert | అడవుల మార్గంలో పులి ప్రయాణం
    • Polavaram Tiger Alert | భయాందోళనలో గ్రామస్తులు

ప్రత్తిపాడు సమీపంలోని బాపన్నదొర కొండల నుంచి బయలుదేరిన ఈ పులి, బవురువాక మరియు తడువాయి అటవీ ప్రాంతాల మీదుగా ప్రయాణించి పోలవరం జిల్లా (Polavaram District) సరిహద్దులోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నాగులకొండ పర్వత శ్రేణిలో సుమారు 10 కిలోమీటర్ల మేర పులి పాదముద్రలను గుర్తించడం జరిగింది.

Polavaram Tiger Alert | అడవుల మార్గంలో పులి ప్రయాణం

పోలవరం డీఎఫ్‌వో శివకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక “హనుమాన్” బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు పులి కదలికలను నిశితంగా గమనిస్తూ, దాని ప్రయాణ మార్గాన్ని ట్రాక్ చేస్తున్నాయి. అవసరమైతే పులిని సురక్షితంగా పట్టుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. పులి (Tiger) సంచారం నేపథ్యంలో ఉర్లకులపాడు, వెంకట్ నగర్, చెరువుకొమ్ముపాలెం, గొల్లవారి వీధి, కొత్తంపాలెం సహా 15కి పైగా గ్రామాల ప్రజలను అటవీ శాఖ హెచ్చరించింది. గ్రామాల్లో మైక్ ప్రకటనలు చేస్తూ, రాత్రివేళ బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.గత రెండు రోజులుగా పశువులపై ఎలాంటి దాడులు జరగకపోవడం కొంత ఉపశమనం కలిగిస్తోంది. పులి తాను వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్తుందనే అంచనాలు కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Polavaram Tiger Alert | భయాందోళనలో గ్రామస్తులు

అయితే, పులి  సంచారం వార్తలతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రైతులు (Farmers) పొలాలకు వెళ్లడానికి కూడా జంకుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు పరిస్థితిని పూర్తిగా అదుపులో ఉంచేందుకు 24 గంటల పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. మొత్తానికి, పెద్దపులి సంచారం నేపథ్యంలో అధికారులు అప్రమత్త చర్యలు చేపడుతుండగా, గ్రామస్తులు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తత కొనసాగించాల్సిన అవసరం ఉంది.

ఇది కూడా చదవండి..: Moinabad Drugs Party | డ్రగ్స్​కు నిలయంగా తెలంగాణ.. పెంచిపోషిస్తున్న ప్రజాప్రతినిధులు.. మొయినాబాద్​ ఫామ్​హౌస్​ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!

Visakhapatnam Firecracker Explosion | విశాఖలో భారీ పేలుడు.. అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా పేలి ఇళ్లు ధ్వంసం
Social Media Ban Kids | 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్​ మీడియా బ్యాన్ ​: ఏపీ సీఎం చంద్రబాబు
AbhiBus Seat Issue | సీటు తప్పుగా కేటాయించిన ట్రావెల్​ సంస్థ.. అభిబస్​కు రూ. 30 వేల జరిమానా!
Tirumala June Quota | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. జూన్​ దర్శన కోటా షెడ్యూల్​ విడుదల
Markapuram Bus Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..
TAGGED:FarmersKakinada DistrictPolavaram DistrictPolavaram Tiger AlertRajavommangi MandalTiger
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hyderabad Food Adulteration Hyderabad Food Adulteration | కల్తీ మాఫియాపై ఉక్కుపాదం.. ప్రత్యేక బృందం ఏర్పాటు
Next Article Sub Collector Saves Woman Sub Collector Saves Woman | ఆత్మహత్యాయత్నం చేసిన యువతి.. ట్యాంక్​ ఎక్కి ప్రాణాలు కాపాడిన సబ్ కలెక్టర్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?