అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Police Prajavani Complaints | నగరంలోని పోలీస్ ప్రజావాణిలో 45 ఫిర్యాదులు స్వీకరించినట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు.
Police Prajavani Complaints | ప్రజావాణిలో..
ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్(Nizamabad Police Commissionerate) పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించి.. వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్సై, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సూచనలు సలహాలు అందజేశారు.
Police Prajavani Complaints | ప్రజలు నిర్భయంగా.. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా..
ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా(law and order india) పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని సీపీ సూచించారు. సమస్యలను చట్టప్రకారం పరిష్కరించుకునేలా,(public grievances india) పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ(nizamabad police) ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలియజేశారు. ప్రజా సమస్యలపై నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని తెలిపారు. వివిధ ఫిర్యాదులకు సంబందించిన 45 ఫిర్యాదులను స్వీకరించారు.

