అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Prajavani Complaints | పోలీస్ ప్రజావాణిలో (police prajavani complaints) భాగంగా 32 ఫిర్యాదుల స్వీకరించారు. ఈ మేరకు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) వివరాలు వెల్లడించారు.
Police Prajavani Complaints | సమస్యలు విని.. పరిష్కార మార్గం చూపి..
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులతో (public grievances) మాట్లాడిన సీపీ సంబంధిత పోలీసస్టషన్ ఇన్ఛార్జీలకు ఫోన్ ద్వారా సమాచారం మాట్లాడారు. చట్టపరమైన పరిష్కార మార్గం చూపాలని వారిని ఆదేశించారు.
నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు..
ప్రజావాణి అనంతరం సీపీ(nizamabad police) మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులు నిర్భయంగా ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా ప్రజావాణిలో తనను సంప్రదించవచ్చన్నారు. స్వచ్చందంగా పోలీసు సేవల్ని(law and order) వినియోగించుకోవాలన్నారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా (police services) పోలీస్ శాఖ పని చేస్తుందని ఆయన అన్నారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను పరిష్కరించుకునే మార్గం కల్పించేందుకే ప్రతి సోమవారం పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: Actress Suicide Case | ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి సూసైడ్..
