అక్షరటుడే, కామారెడ్డి : Police Retirement Advice | ఉద్యోగ విరమణ అనంతరం పోలీసు సిబ్బంది కుటుంబంతో ప్రశాంతంగా గడపాలని జిల్లా అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి (Additional SP Narsimha Reddy) అన్నారు.
పోలీసు శాఖకు సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన బాన్సువాడ ఎస్సై యం.ప్రకాష్ (Banswada SI Prakash), వీఆర్ ఎస్సై యం.రాజయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ యం.నారాయణలను జిల్లా పోలీసు కార్యాలయానికి కుటుంబ సభ్యులతో సహా ఆహ్వానించి శాలువాలతో సత్కరించారు.
Police Retirement Advice | అంకితభావం.. క్రమశిక్షణతో..
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. సుమారు 40 నుంచి 42ఏళ్ల పాటు పోలీసు శాఖ (Police Department)కు అంకితభావం, క్రమశిక్షణతో సేవలందించినందుకు అభినందనలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం శేష జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా గడపాలంటే ముందస్తు ప్రణాళిక అవసరమని సూచించారు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. రిటైర్మెంట్ అనంతరం వారికి అందాల్సిన అన్ని ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీసు శాఖ నుంచి పూర్తి సహకారం అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, ఆర్‌ఐలు నవీన్ కుమార్, కృష్ణ, సంతోష్ కుమార్, ఆర్ఎస్సైలు, ఎస్సైలు, కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Hanuman Jayanti Celebrations | హనుమాన్ జయంతిని ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
