Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Illegal Quarry | అక్రమ క్వారీలు నిర్వహిస్తున్న ‘పొంగులేటి’ : హరీశ్​రావు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Illegal Quarry | అక్రమ క్వారీలు నిర్వహిస్తున్న ‘పొంగులేటి’ : హరీశ్​రావు

తెలంగాణతాజా వార్తలు

Illegal Quarry | అక్రమ క్వారీలు నిర్వహిస్తున్న ‘పొంగులేటి’ : హరీశ్​రావు

మంత్రి పొంగులేటికి చెందిన కంపెనీ అక్రమంగా క్వారీ నిర్వహిస్తోందని హరీశ్​రావు ఆరోపించారు. ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 3, 2026 11:32 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Illegal Quarry
Illegal Quarry

అక్షరటుడే, వెబ్​డెస్క్: Illegal Quarry | ఓఆర్‌ఆర్‌కు ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్ మండలంలోని మానసహిల్స్ ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Ponguleti Srinivas Reddy)కి చెందిన సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ క్వారీలు నిర్వహిస్తోందని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) ఆరోపించారు. అనుమతులు లేకుండా కొండలను పిండి చేసి కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

Contents
  • Illegal Quarry | అనుమతులు లేకుండానే..
    • Illegal Quarry | రియల్​ ఎస్టేట్​ కోసం..
      • Illegal Quarry | హైడ్రా ఎక్కడ..

రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్లను తొలుస్తూ, అక్రమంగా తరలిస్తూ వ్యాపారం చేస్తున్నారని హరీశ్​రావు ఆరోపించారు. అయినా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదన్నారు. మంత్రి కుటుంబం చేసే అక్రమ దందాలో ఎవరికి వాటాలు వెళ్తున్నాయని ఆయన ప్రశ్నించారు. క్వారీకి ఎలాంటి అనుమతులు లేకున్నా మంత్రి కుటుంబం అయితే సరిపోతుందా అని ప్రశ్నించారు.

Illegal Quarry | అనుమతులు లేకుండానే..

సదరు క్వారీకి పీసీబీ, పర్యావరణ అనుమతులు లేవన్నారు. మైనింగ్/క్వారీయింగ్ లీజ్, మైన్స్ & జియాలజీ విభాగం, స్థానిక గ్రామపంచాయతీ/మున్సిపల్ అనుమతి లేవన్నారు. ల్యాండ్ యూజ్ మార్పిడి క్లియరెన్స్ లేదని పేర్కొన్నారు. ఏ అనుమతులు లేకుండానే యథేచ్ఛగా క్వారీ నిర్వహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Illegal Quarry | రియల్​ ఎస్టేట్​ కోసం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుతారని, మరోవైపు తన అల్లుడి అనుయాయుల క్వారీ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా 17 ఎకరాల ప్రభుత్వ భూమి కట్టాబెట్టారన్నారు. ఇంకోవైపు మంత్రి పొంగులేటి అక్రమ క్వారీతో ఏకంగా కొండలనే ఖతం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా? లేక రియల్ ఎస్టేట్ (Real Estate) కంపెనీనా అని హరీశ్​రావు ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు రక్షించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులే భూ బకాసురులుగా మారి భూములను భక్షిస్తున్నారన్నారు.

Illegal Quarry | హైడ్రా ఎక్కడ..

ప్రభుత్వ ఆస్తిని మంత్రి కంపెనీ అప్పనంగా తన్నుకు పోతుంటే హైడ్రా (Hydraa) ఎక్కడికి వెళ్లిందని మాజీ మంత్రి ప్రశ్నించారు. శని, ఆదివారాలు వచ్చిందంటే చాలు పేదల ఇళ్ల మీదకు వెళ్ళే హైడ్రా బుల్డోజర్​కు ప్రభుత్వ భూమిలో ఉన్న ఈ అక్రమ క్వారీ కనిపించడం లేదా అన్నారు. సాధారణ ప్రజలకు ఒక న్యాయం? ముఖ్యమంత్రి అల్లుడి అనుయాయులు, మంత్రులకు ఒక న్యాయమా అని నిలదీశారు. అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్న రాఘవ కన్​స్ట్రక్షన్​ కంపెనీ (Raghava Construction Company)పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Telangana Control Room | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. కంట్రోల్​ రూం ఏర్పాటు చేసిన ప్రభుత్వం

ACB Catches SI | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్సైలు
IPF UAE 24×7 Help | యూఏఈలో ఇండియన్ పీపుల్స్ ఫోరం హెల్ప్ లైన్​ సర్వీస్.. సమస్యలకు పరిష్కారానికి సహాయ వేదిక​!
Revive Plants Tips | మొక్కలు వాడిపోతున్నాయా.. ఈ చిట్కాలతో పచ్చగా మార్చండిలా!
Ustaad Bhagat Singh Glimpse | ఇక గూస్​ బంప్సే​.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌
AbhiBus Seat Issue | సీటు తప్పుగా కేటాయించిన ట్రావెల్​ సంస్థ.. అభిబస్​కు రూ. 30 వేల జరిమానా!
TAGGED:CM Revanth ReddyHarish RaoHydraaPonguleti Srinivas ReddyRaghava Construction CompanyReal Estate
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Shivaji Raja Father Death Shivaji Raja Father Death | సీనియర్ నటుడు శివాజీ రాజా తండ్రి కన్నుమూత.. శోక‌సంద్రంలో కుటుంబ స‌భ్యులు
Next Article Vijay Rashmika Sangeeth Pics Vijay Rashmika Sangeeth Pics | సంగీత్ ఫొటోలతో ట్రెండింగ్‌లో విజయ్–రష్మిక.. ఏమ‌న్నా ఎంజాయ్ చేశారా..!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?