అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ponguleti vs KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై (Ponguleti vs KTR) మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంపై ఆయన స్పందించారు. సచివాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు.
Ponguleti vs KTR | ఇళ్ల కూల్చివేత
వెలుగుమట్లలో భూదాన్ భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అక్కడ నిర్మించకున్న ఇళ్లను కూల్చివేశారు. బాధితులను గురువారం కేటీఆర్ పరామర్శించారు. ఈ క్రమంలో పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ అత్యధిక ఓట్లు సాధించడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేక పోతోందన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు, ఫామ్ హౌస్‌లో కూర్చుకొన్న పితామహుడు కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై విషం కక్కుతున్నారని ఆరోపించారు.
పెయిడ్ ఆర్టిస్టులతో..
ఖమ్మంలో ఏడ్చే వాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులు అని పొంగులేటి అన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి డ్రామాలు ఆడిస్తున్నారని ఆరోపించారు. యూట్యూబ్ ఛానెళ్లలో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులపై బీఆర్ఎస్ రాద్దాంతం చేస్తోందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించిందన్నారు. రూ.5600 కోట్లు తుమ్మడి హట్టికి ఖర్చు చేశామని చెప్పారు. బీఆర్ఎస్ స్వలాభం కోసం కాళేశ్వరం దగ్గర ప్రాజెక్ట్ కట్టిందని ఆరోపించారు. ఆ ప్రాజెక్ట్ మూడేళ్లలోనే కుప్పకూలిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమం అమలు చేస్తుండటంతోనే ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తున్నారని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Sri Lanka Defeat | ఐసీసీ వరల్డ్ కప్‌లో లంకకి ఘోర అవమానం… 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదో చెత్త రికార్డు
Live: Hon’ble Minister for Revenue, Housing & I&PR, Sri Ponguleti Srinivasa Reddy Garu, addressing the media along with colleague Ministers at the Dr. B. R. Ambedkar Telangana State Secretariat. https://t.co/kEPlkdRjML
— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) February 26, 2026

